Mega Star: అభిమానులను ఆకట్టుకున్న చిరంజీవి కొత్త యాడ్..!

 

Mega Star:మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో యువ హీరోలతో సమానంగా ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి తీసిన ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది.మరోవైపు వేదాళమ్ రీమేక్ భోళా శంకర్‌, లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సెట్స్ పై ఉన్నాయి.  ఇవి కాకుండా మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో 154వ చిత్రాన్ని చేస్తున్నారు.వరుసగా సినిమా షూటింగులతో బిజీగా ఉన్న చిరు త్వరలోనే “ఆచార్య” ప్రమోషన్లను స్టార్ట్ చేయనున్నారు. ఒకవైపు డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు.

అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సుకుమార్ దర్శకత్వంలో ఒక యాడ్ చేస్తున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.శుభగృహ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మెగాస్టార్‌ చిరంజీవి ఈ యాడ్ చేస్తున్నట్టు వారే స్వయంగా వెల్లడించారు కూడా. అన్ని ప్రముఖ టీవీ ఛానెల్స్‌తో పాటు సోషల్‌ మీడియాలో ప్రసారం కానుంది.

తాజాగా బయటకు వచ్చిన ఈ యాడ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. యాడ్‌లో మెగాస్టార్‌తో పారు ఖుష్బూ, అనసూయ భరద్వాజ్ కన్పించగా, ఒక మంచి ట్విస్ట్‌తో హ్యాపీ న్యూస్‌ను రెవీల్ చేశారు. ఉగాది పర్వదినాన విడుదలైన ఈ యాడ్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.