మెగా గాసిప్.. నిజం లేదన్న బ్రో టీమ్!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న బిగ్ ప్రొడక్షన్ హౌస్ లలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఒకటి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మాతలుగా ఈ ప్రొడక్షన్ హౌస్ నడుస్తోంది. చిన్న సినిమాలతో మూవీ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ప్రస్తుతం ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ తో చేసిన బ్రో మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఇవి మాత్రమే కాకుండా తమ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే ఏడాది 10 పాన్ ఇండియా సినిమాలు ఉంటాయని నిర్మాత విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. అలాగే బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలని కూడా నిర్మించాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు. తక్కువ సమయంలో 100 సినిమాలు కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. నిర్మాతలుగా సినిమాలు చేస్తూనే మరో వైపు డిస్టిబ్యూషన్ లోకి అడుగుపెట్టి ఆదిపురుష్ చిత్రాన్ని రిలీజ్ చేశారు.

ఇప్పుడు సలార్ చిత్రంపై దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ టాలీవుడ్ లో టాప్ హీరోలందరితో మూవీస్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో ఓ మూవీ కోసం అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారంటూ ప్రచారం తెరపైకి వచ్చింది. ఓ పాన్ ఇండియా మూవీ కోసం మెగాస్టార్ తో చేతులు కలిపినట్లు జోరుగా వినిపిస్తోంది.

అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. కానీ అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి తాము ముందుంటామని, తనకి అదొక గొప్ప సంతోషాన్ని కూడా ఇస్తుందని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేశారు. ఒకవేళ ఉంటే మాత్రం తామే అవీషియల్ గా కన్ఫర్మ్ చేస్తామని కూడా తెలిపారు.

ఏది ఏమైనా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ స్పీడ్ చూస్తూ ఉంటే కచ్చితంగా టాలీవుడ్ స్టార్స్ అందరితో సినిమాలు చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనే మాట వినిపిస్తోంది. ప్రభాస్, మారుతి కాంబో, బ్రో సినిమాలు సక్సెస్ అందుకుంటే వారు మరిన్ని సినిమాలని ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. గూఢచారి 2 మూవీ పాన్ ఇండియా లెవల్ లో ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి రానుంది.