తన అత్తగారి గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన మెగా డాటర్ నిహారిక… ఏమన్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కుటుంబం అంటే ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి గుర్తింపు పొందారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక మొదట యాంకర్ గా బుల్లితెర మీద సందడి చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గా మరి పలు సినిమాలలో నటించింది. అయితే హీరోయిన్గా నిహారిక సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత సినిమాలకు దూరమై జొన్నలగడ్డ చైతన్య ని వివాహం చేసుకుంది. అయితే వివాహం తర్వాత తన భర్త ప్రోత్సాహంతో నిర్మాతగా మారింది.

ఇలా నిహారిక నిర్మాతగా మారి వెబ్ సిరీస్, సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉండటమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన అందమైన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా కొంతకాలంగా నిహారిక తన భర్తకు విడాకులు ఇవ్వనుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారాయి అయితే నిహారిక మాత్రం ఈ వార్తలలో నిజం లేదని క్లారిటీ ఇస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల నిహారిక నిర్మాతగా వ్యవహరించిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనే సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. నిర్మాతగా మంచి హిట్ అందుకున్న నిహారిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా నిహారిక ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఈ ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారిగా తన అతిథి విశేషాల గురించి వివరించింది. ఈ ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ…నేను చాలా అల్లరి పిల్లని ..మా ఇంట్లో వాళ్ళు నన్ను భరించలేక భరించారు . నేను పుట్టింట్లో ఎలా ఉన్నానో అత్తింట్లో కూడా అలాగే ఉన్నాను. మా అత్తయ్య మామయ్య నన్ను చాలా బాగా చూసుకుంటారు. నాకు ఆకలేస్తుంది అంటే మా అత్తమ్మ వచ్చి నాకు తినిపిస్తుంది . ఆవిడ చాలా సరదాగా ఉంటుంది. నువ్వు మా చైతన్యను చూసుకో నిన్ను మేము చూసుకుంటాం అంటూ ఉంటారు . మా ఇంట్లో నేను 10:00కు నిద్ర లేచే దాన్ని . అప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు తలుపు కొట్టి మరీ నన్ను నిద్రలేపేవారు ..కానీ మా అత్తగారింట్లో నాకు ఆ ప్రాబ్లమే లేదు.. తలుపు కూడా కొట్టరు. నాకు ఇష్టం వచ్చినంత సేపు పడుకొనిస్తారు. ఈ విషయంలో మాత్రం మా అత్త గారికి కాళ్ళు మొక్కాలి “అంటూ తన అత్తగారి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.