ఖరీదైన కొత్త కారు కొనుగోలు చేసిన మెగా కోడలు… ధర ఎంత అంటే?

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు తీసుకుంటూనే మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఆరోగ్య సూత్రాలను తెలియజేస్తూ అందరికీ ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియజేస్తూ రోజురోజుకు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ విధంగా ఒకవైపు మెగా ఇంటి బాధ్యతలను చేపడుతూ మరోవైపు తన వృత్తిపరమైన జీవితంలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా ఈమె పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తూ తన మంచి మనసు చాటుకున్నారు.

ఇకపోతే తాజాగా ఉపాసన తన గ్యారేజ్ లోకి కొత్త కారును ఆహ్వానించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈమె ఎంతో ఖరీదైన కొత్త కారును కొనుగోలు చేసినట్టు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఇక ఈ కారుకు సంబంధిత ఫీచర్స్ చెబుతూ ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈమె ఆడి ఈ ట్రాన్ కారును కొనుగోలు చేసుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ కారు గురించి ఉపాసన తెలియజేస్తూ తన దృష్టిలో భవిష్యత్తు అంటే సుస్థిరతతో పాటు ప్రగతి శీలమైన లగ్జరీ కూడా కలిసి ఉంటుందని.. ఆడి ఇ-ట్రాన్ ఆ రెండింటినీ ఇస్తుందని ఈమె తెలిపారు. ఇక ఈ కారు ధర విషయానికి వస్తే సుమారు కోటి 20 లక్షల రూపాయల వరకు విలువ చేస్తుందని తెలుస్తుందని చెప్పవచ్చు. ఎన్నో అధునాతనమైన ఫీచర్స్ కలిగి ఉన్న ఈ కారు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు ఉపాసనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.