దేవుడిచ్చిన దీవెన అంటూ పెళ్ళి రోజున భర్తని తలుచుకొని ఎమోషనల్ అయినా మీనా?

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కొన్ని రోజుల క్రితం మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే మీనా తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అయితే కొందరు నీచులు మాత్రం మీనా గురించి వివిధ రకాల వార్తలు ప్రచారం చేస్తున్నారు. గతంలో మీనా కుటుంబ సభ్యులు కరోనా బారిన పడి సరైన చికత్స తీసుకొని కరోనా నుండి కోలుకున్నారు. మీనా భర్త కూడ కరోనా నుండి కోలుకున్నాడు.

అయితే మీనా భర్త విద్యా సాగర్ కి ముందు నుండి ఊపిరితిత్తుల సమస్యలు ఉండటంతో కరోనా తగ్గిన తర్వాత కూడా ఆయన ఆరోగ్యం క్షేనించిపోయింది. ఈ క్రమంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువై ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని డాక్టర్లు సూచించారు. అయితే ఊపిరితిత్తులు దానం చేసేవారు దొరక ఆయనకు జరగాల్సిన సర్జరీ ఆగిపోయింది. దీంతో డాక్టర్లు మందులతో తనని కాపాడటానికి ప్రయత్నం చేశారు. కానీ విద్యాసాగర్ ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. భర్త మరణించిన తర్వాత పుట్టడు దుఃఖంలో ఉన్న మీనాని బాధపెట్టేలాగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో విద్యాసాగర్ తనకి ఉన్న 250 కోట్లకు పైగా ఆస్తిని తన కూతురి పేరు మీద రాసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

విద్యాసాగర్ తో మీనా వివాహం 2009 జూలై 12వ తేదీన జరిగింది. అయితే మీనా భర్త జూన్ 29వ తేదీ అనారోగ్యంతో కన్నుమూశాడు. ఇటీవల మీనా పెళ్లిరోజు సందర్భంగా తన భర్త ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలో.. నువ్వు ఒక దేవుడిచ్చిన దీవెనవీ… . కానీ ఆ దేవుడు నిన్ను చాలా త్వరగా నానుంచి తీసుకెళ్లాడు. నువ్వు ఎప్పటికీ నా గుండెల్లో ఉంటావు. మా ఫ్యామిలీ, నేను ప్రపంచం నలుమూలల నుంచి ప్రేమను పంపిస్తున్నా. అంతే కాదు ఈ విపత్కర పరిస్థితుల్లో తమపై.. స్నేహితులు, ఫ్యామిలీ శ్రద్థ, ప్రేమ చూపస్తూ.. సపోర్ట్ చేస్తున్నారో…అందరికీ నా కృతజ్ఞతలు… అంటూ మీనా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం మీనా షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.