Allu Arjun : కావాలనే అల్లు అర్జున్ ను పక్కనపెట్టారా…బన్నీ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నది అందుకేనా..?

Allu Arjun : పుష్ప పార్ట్ 1 సినిమాతో బన్నీ రేంజ్ ఇండియా మొత్తం పెరిగింది. ఈ సినిమాతో అధికారికంగా పాన్ ఇండియా స్టార్ గా అయ్యాడు అల్లు అర్జున్. ఈ సినిమా లోని బన్నీ డైలాగులు, మ్యానరిజమ్స్ ను సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా అనుకరించారు.

పుష్ప ఫీవర్ ఎంతలా ఉందంటే విదేశాల్లోని వారు కూడా పుష్ప సినిమాలోని పాటలకు స్టెప్స్ వేస్తూ బన్నీ మ్యానరిజంను అనుకరించి సామాజిక మాధ్యమంలో పంచుకునేంత. పాన్ ఇండియా సినిమాల గురించి ప్రస్తావన వస్తే, ఖచ్చితంగా అందులో ‘పుష్ప’ ప్రస్తావన కూడా వచ్చి తీరాల్సిందేనని తెలుస్తుంది.. అయితే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్లలో ఎక్కడా ‘పుష్ప’ ప్రస్తావన అయితే రావడంలేదు. పైగా, రాజమౌళి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా కూడా రాబోతోందట.. అన్న ప్రచారం జరుగుతున్న సమయంలో కూడా, రాజమౌళి వద్ద ఈ ప్రశ్నని తెలుగు మీడియాగానీ, ఇతర భాషలకు చెందిన మీడియాగానీ అస్సలు ప్రస్తావించకపోవడం అల్లు అర్జున్ అభిమానుల్ని తీవ్రంగా కలచివేస్తోంది.

ఇక రాజమౌళిని మహేష్ సినిమా గురించి మీడియా ప్రశ్నలు వేయగా మహేష్ – రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాలో నందమూరి బాలకృష్ణ ఓ కీ రోల్ చేయబోతున్నారట నిజమేనా . అన్న అంశమూ ప్రస్తావనకు వచ్చింది. అయితే, మహేష్ సినిమాలో ఇంకెవరూ కూడా వుండరు.. అందులో ఆయనొక్కడే హీరో.. అని రాజమౌళి స్పష్టత అయితే ఇచ్చేశాడు.

అదే సమయంలో, అల్లు అర్జున్‌తో సినిమా ఎప్పుడు అని ప్రశ్నించిన తెలుగు మీడియా, కన్నడ మీడియా.. రెండూ లైట్ తీసుకోవడం విశేషం. అల్లు అర్జున్‌ని కావాలనే మీడియా పక్కన పెట్టిందా.? అన్న చర్చ కూడా తెరపైకొస్తోందిప్పుడు. ఈ విషయమై అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ రగిలిపోతున్నారు. మరి చూడాలి అల్లు అర్జున్ ఫాన్స్ వారి కోపాన్ని ఏ విధంగా చూపిస్తారో చూడాలి మరి.