మాసివ్ అప్డేట్ : ప్రభాస్ వరల్డ్ ప్రాజెక్ట్ లో కమల్ ఖరారు.!

మన ఇండియన్ సినిమా నుంచి మొట్ట మొదటిగా అనౌన్స్ అయ్యిన వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ కోసం అందరికీ తెలిసిందే. మరి పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ సినిమా ఇది కాగా ఒక పవర్ ఫుల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ భారీ చిత్రంలో ప్రభాస్ తో పాటుగా అమితాబ్ బచ్చన్, దిశా పటాని, దీపికా పదుకొనె లాంటి బిగ్ స్టార్స్ ఉండగా గత కొన్నాళ్ల నుంచి అయితే ఓ సెన్సేషనల్ రూమర్ ఉలగనయగన్ కమల్ హాసన్ కూడా ఉన్నారని టాక్ రాగా మరి ఈ రోజే దానిపై అధికారిక అప్డేట్ కూడా ఉంటుంది అని.

మేము కన్ఫర్మ్ చేసాము, ఇప్పుడు దీనిపై మేకర్స్ ఓ మాసివ్ అప్డేట్ ని ఇపుడు ఇచ్చేసారు. కాగా కమల్ హాసన్ తమ ప్రాజెక్ట్ కే లో ఉన్నారని ఈ భూమిని కప్పేయడానికి ఒక నీడ కావాలి ఆ నీడ కమల్ హాసన్ మాత్రమే అని తమ ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

పైగా కమల్ పేరు కూడా కే లెటర్ తోనే రావడం సినిమా టైటిల్ తో కనెక్ట్ కావడంతో మరో ఇంట్రెస్టింగ్ అంశం. ఇక ఇక ఈ భారీ చిత్రంలో కమల్ హాసన్ ఈరోజు నుంచే సెట్స్ లో జాయిన్ కాగా ఆయనపై అయితే నెల రోజులు లోపు షూటింగ్ కొనసాగనుంది. మొత్తానికిఆ అయితే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. ఇంకా ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.