బిగ్ అప్డేట్ : “రజినీ 169” కి అదిరిపోయే టైటిల్..మేకర్స్ సాలిడ్ అనౌన్సమెంట్.!

తమిళ నాట సూపర్ స్టార్ పాన్ ఇండియా సినిమా దగ్గర సిసలైన సూపర్ స్టార్ అయినటువంటి రజినీకాంత్ ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రజిని కెరీర్ లో 169వ సినిమా అయినటువంటి ఈ చిత్రం అనౌన్స్ అయ్యి చాలా రోజులు కాగా ఈ గ్యాప్ లో చిత్రం పై అనేక రూమర్స్ కూడా స్పెక్యులేట్ అయ్యాయి. 

అయితే ఈ చిత్రానికి గాను ఒక అదిరే టైటిల్ ని పెట్టినట్టుగా పలు టైటిల్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు మేకర్స్ అధికారికంగా ఈ చిత్రం టైటిల్ ని ఇప్పుడు రివీల్ చేశారు. మరి ఈ చిత్రానికి అయితే “జైలర్” అనే మాస్ టైటిల్ ని పెట్టినట్టుగా ఒక ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. రక్తంతో ఉన్న కత్తి బ్యాక్గ్రౌండ్ లో జైలు సెటప్ అంతా చూస్తూనే అదిరే యాక్షన్ సీన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. 

అలాగే ఈ టైటిల్ తో రజిని ఎలా కనిపిస్తారో అనేది కూడా రివీల్ అయ్యింది అని చెప్పాలి ఒక గ్యాంగ్ స్టర్ గా తాను కనిపిస్తాడని టాక్ ఉంది మరి ఇప్పుడు ఈ టైటిల్ రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రంలో శివ కార్తికేయన్ కూడా కీలక పాత్రలో నటిస్తుండగా ఐశ్వర్య రాయ్ నటిస్తుందని టాక్ ఉంది. అలాగే కె ఎస్ రవికుమార్ ఈ చిత్రానికి కీలక వర్క్ అందిస్తున్నారు. అలాగే సన్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.