క్రాక్ మీద నమ్మకంతో రిస్క్ లో పడిన మాస్ రాజా

మాస్ మహారాజా రవితేజ మరోసారి కెరీర్ లో వరుస అపజయలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. రాజా ది గ్రేట్ కంటే ముందు ఇదే తరహాలో అపజయాలు ఎదుర్కొన్న రవితేజ ఇప్పుడు కెరీర్ కు బూస్ట్ ఇచ్చే సినిమా చేయాలని అడుగులు వేస్తున్నాడు. డిస్కో రాజా క్లిక్కవుతుందని ఎంతగానో నమ్మకం పెట్టుకున్నాడు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు క్రాక్ సినిమాపై మాత్రం మాస్ రాజా అంతకంటే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాడు.

క్రాక్ సినిమాను గోపిచంద్ మలినేని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఓటీటీ ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా ఈ సినిమాను అమ్మలేదు. ఎలాగైనా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని అడుగులు వేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మాస్ రాజా చాలా ఆఫర్స్ ను రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అపజయాల కారణంగా మార్కెట్ పై ఎఫెక్ట్ పడిందని కొందరు నిర్మాతలు ఆయన రెమ్యునరేషన్ తగ్గించి ఆఫర్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారట. ఇటీవల సీతారా ఎంటర్టైన్మెంట్స్ కూడా అలాంటి కండిషన్ తోనే మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఇచ్చింది.

అలాగే మైత్రి మూవీ మేకర్స్ అలాగే మరో బడా ప్రొడక్షన్ నుంచి కూడా దాదాపు అలాంటి ఆఫర్స్ వచ్చయట. మార్కెట్ లేదు కాబట్టి ఇచ్చినంత తీసుకోవాలన్నట్లుగా డీల్ సెట్ చేసుకోవాలని చెప్పడంతో రవితేజ కొన్ని సినిమాలను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. క్రాక్ సినిమా హిట్టయితే తాను అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాలని చాలెంజ్ చేసి మరీ వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడట. అంతగా క్రాక్ ను నమ్ముతున్న రవితేజ ఆ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి మరి.