ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ గా ఎదిగిన నటులలో రవితేజ ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు మాస్ మహారాజ్ గా ఎదిగిన అతని జర్నీ నిజంగా ఒక ఇన్స్పిరేషన్. ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ సినిమాల మీద సినిమాలు తీస్తూ హిట్స్ అందుకుంటున్నాడు. రవితేజ తన సోదరులని ఇండస్ట్రీకి పరిచయం చేసినప్పటికీ వారు ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు.
ఇక తన పిల్లలు అయిన కొడుకు మహాధన్ ని ఇప్పటికే రాజా ది గ్రేట్ సినిమాలో బాలనటుడిగా ఇండస్ట్రీకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను చదువుకుంటూ మరొకవైపు నటన, డైరెక్షన్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు రవితేజ కూతురు మోక్షధ కెరియర్ పై ఫోకస్ చేసినట్లు ఉన్నాడు రవితేజ. ఆమెకి డైరెక్షన్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ ని ఎంకరేజ్ చేసే విధంగా టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ అయినా సీతార ఎంటర్టైన్మెంట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేసినట్లు సమాచారం.
రవితేజ కూడా మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి తర్వాత ఈ స్థాయికి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కూతురు మోక్షద కూడా ముందు దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుని ఆ డిపార్ట్మెంట్ లోనే వర్క్ చేస్తుందా లేదంటే తండ్రి లాగా నటన వైపు మొగ్గు చూపుతుందో తెలియాలంటే కొన్ని సంవత్సరాలు ఆగాల్సిందే. ఇక రవితేజ కెరియర్ విషయానికి వస్తే ఈ సంవత్సరం ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలతో మనం ముందుకి వచ్చినప్పటికీ ఆ సినిమాలో పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయాయి.
ఒక మంచి హిట్ సినిమా తీయాలని ప్రయత్నాల్లో ఉన్న రవితేజ మరోవైపు నిర్మాతగా మారి సినిమాలోని నిర్మిస్తున్నాడు కూడా. కష్టం విలువ తెలిసిన వాడే తన పిల్లలకు కూడా ఆ కష్టం విలువ తెలిసేలా పెంచుతాడు అనే మాటలను నిజం చేసే విధంగా రవితేజ తన పిల్లలను క్రింది స్థాయి నుంచే ఉన్నత శిఖరాలకు చేర్చే ప్రయత్నాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.