ట్రైలర్ టాక్ : “ఈగిల్” గా మాస్ మహారాజ్ విధ్వంసం

టాలీవుడ్ సినిమా దగ్గర తమ స్వశక్తితో ఎదిగి తమ సినిమాలకంటూ మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్న కొందరి హీరోస్ లో ఎనర్జిటిక్ సీనియర్ హీరో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు. కాగా ఇపుడు రవితేజ హీరోగా నటించిన “టైగర్ నాగేశ్వరరావు” తన కెరీర్ లో ఓకే అనిపించింది.

ఇక ఈ సినిమా తర్వాత తాను హీరోగా నటించిన మరో భారీ చిత్రమే “ఈగిల్”. దీనిని కూడా కొత్త దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించగా ఈ సినిమాని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపబోతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఒకో అప్డేట్ ఇస్తూ ఇపుడు థియేట్రికల్ ట్రైలర్ ని అయితే దింపారు.

మరి ఈ ట్రైలర్ భారీ ఏక్షన్ ఎలిమెంట్స్ బావుంది అని చెప్పొచ్చు. అలాగే రవితేజ మాస్ అవతార్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. తన పాత్రని మాత్రం దర్శకుడు గట్టిగానే రాసుకున్నాడు అనిపిస్తుంది. తనపై సీన్స్ కానీ ఏక్షన్ బ్లాక్ లు గాని వేరే లెవెల్లో కనిపిస్తున్నాయ్. అలాగే హీరోయిన్స్ కావ్య థాపర్ అనుపమ పరమేశ్వరన్ లు డీసెంట్ రోల్స్ లో చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది.

కాకపోతే సినిమాలో కాన్సెప్ట్ కూసింత రొటీన్ గానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ తమని ప్రేమించే కొందరి జనం వారికి ఏమైంది అలాగే హీరో లైఫ్ లో ఓ భారీ ఇన్సిడెంట్ ఇలా అనిపిస్తుంది. ఇక ఇవి పక్కన పెడితే ట్రైలర్ లో మ్యూజిక్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా కూడా ఉంది. మరి మొత్తానికి అయితే ఈ జనవరి 13న రవితేజ విధ్వంసాన్నే తీసుకొచ్చేలా ఉన్నారు. చూడాలి మరి దీనికేం అవుతుందో అనేది.
EAGLE Trailer | Ravi Teja | Anupama | Kavya Thapar | Karthik Gattamneni | People Media Factory