రాజా డీలాక్స్ ఇంటిని బయటపెట్టిన మారుతి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజా డీలాక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ కథాంశం ఏంటి అనేది ఇప్పటి వరకు బయటకి రాలేదు. అప్పుడప్పుడు మూవీకి సంబంధించి కొన్ని లీక్ ఫోటోలు బయటకి వచ్చినా కూడా వాటితో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ మళ్ళీ కొద్ది రోజుల క్రితం మొదలైంది.

ఇక ఈ షెడ్యూల్ లో హీరో, హీరోయిన్స్ కాంబినేషన్ సన్నివేశాలని షూట్ చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే హర్రర్ కామెడీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతుంది అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సత్యరాజ్ ప్రభాస్ తాతయ్య పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం ఏకంగా ఐదు కోట్ల రూపాయిలతో భారీ సెట్ ని వేసినట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే తాజాగా దర్శకుడు మారుతి ఒక్క ఫోటోతో ఈ మూవీ సెట్ ని రివీల్ చేసేశారు.

తన అఫీషియల్ అకౌంట్ నుంచి రాజా డీలాక్స్ షూటింగ్ టైంలో తీసుకున్న ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలో బ్యాక్ డ్రాప్ లో ఓ వింటేజ్ లుక్ లో బంగ్లా కనిపిస్తుంది. ఆ బంగ్లా చూస్తూ ఉంటే పురాతన కాలంనాటిదిగా ఉంది. చూడటానికి కూడా బూత్ బంగ్లా తరహాలో ఉండటం విశేషం. ఈ బంగ్లా లైట్ బ్యాగ్రౌండ్ కూడా పాతకాలం నాటి దీపాలతో ఉండటం విశేషం. ఇదే బంగ్లాలో రాజా డీలాక్స్ మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది.

షూటింగ్ మొత్తం ఇదే బంగ్లాలో ఉంటుందని అసలు అవుట్ డోర్ షూట్ ఉండదని సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఏకంగా వంద కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మూవీకి ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రేక్షకులకి ఈ సినిమా ద్వారా ఆద్యంతం నవ్వుకునే స్థాయిలో వినోదాన్ని అందించే ప్రయత్నం మారుతి చేయబోతున్నట్లు తెలుస్తుంది.