ఇన్సైడ్ టాక్ : ప్రభాస్ సినిమాకి ఈ టైటిల్ ఫిక్స్ చేసిన మారుతీ.?

ఇప్పుడు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఆదిపురుష్” తో ప్రభాస్ బాక్సాఫీస్ వైఫల్యాన్ని అయితే అందుకున్నాడు. మరి ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరిన్ని చిత్రాలు చేస్తుండగా ఈ సినిమాల్లో దర్శకుడు మారుతీ తో చేస్తున్న ఓ క్విక్ ప్రాజెక్ట్ కూడా ఒకటి.

అయితే ఈ చిత్రం మిగతా భారీ సినిమాలకు మినహా ఓ క్రేజీ ఎంటర్టైనర్ గా అయితే మేకర్స్ షేప్ చేస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం షూటింగ్ కూడా వేగంగానే కంప్లీట్ అవుతుండగా లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం మరో సారి వార్తల్లోకి వచ్చింది. అయితే ఈ చిత్రం స్టార్ట్ చేసిన టైం లోనే ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ పెట్టారని టాక్ వచ్చింది.

దీనితో దానికి పెద్దగా స్పందన రాలేదు కానీ ఇపుడు వినిపిస్తున్న టైటిల్ తో అయితే దానికన్నా ఆ రాజా డీలక్స్ టైటిల్ నే బాగుంది అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈసారి వైరల్ టైటిల్ ఏమిటంటే “అంబాసిడర్” అట. మరి ఈ కొత్త టైటిల్ ని మారుతి ప్రభాస్ కోసం ఆలోచిస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇది విన్నాక అయితే దానికన్నా ఆ డీలక్స్ టైటిల్ బెటర్ రా బాబు అని అనుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి. కాగా ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.