మంచి కాన్సెప్ట్ తో విడుదలైన ‘మణిశంకర్’ టీజర్!

జి వెంకట కృష్ణన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మణిశంకర్’. ఈ సినిమా డబ్బు చుట్టూ తిరిగే నేపథ్యంలో యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కనుంది. ఇందులో శివ కంఠమనేని, సంజనా గల్రాని, ప్రియా హెగ్డే, చాణక్య తదితరులు నటిస్తున్నారు. లైట్ హౌస్ సి వి క్రియేషన్స్ పతాకంపై కె. ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీనివాస రావు, ఏం ఫణి భూషణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎం. ఎల్. రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ ను డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ విడుదల చేయగా.. కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా టీజర్, పోస్టర్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి అంటూ.. సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా డైరెక్టర్ ఈ కథను రాసినట్లు తెలిపాడు. శివ కంఠమనేని నటన బాగుందని.. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని కోరాడు. ఇక ఈ సినిమాతో డైరెక్టర్ కు, హీరోకు మంచి సక్సెస్ రావాలని కోరాడు.

ఇక ఈ సినిమా డైరెక్టర్ వెంకటకృష్ణన్ మాట్లాడుతూ.. ఈ సినిమా టీజర్ కళ్యాణ్ కృష్ణ విడుదల చేయటం సంతోషంగా ఉందని అన్నాడు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్.. మంచి సస్పెన్స్ తో కంటెంట్ ఉందని తెలిపాడు. అంతేకాకుండా హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ.. ఈ టీజర్ తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నామని తెలిపాడు.

మంచి ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ అని.. డీలింగ్స్ కు సంబంధించిన కథ అని తెలిపాడు. ఇక ఈ సినిమా కథ సంజన, ప్రియా హెగ్డే, చాణక్య ల చుట్టే తిరుగుతుందని అన్నాడు. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయని వాటి ద్వారా ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అనే నమ్మకం తనకు ఉందని తెలిపాడు.