జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జోన్ సినిమా డిసెంబర్ 25న రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యనే తన ప్రియుడు ఆంటోనీని రెండు మతాచారాల ప్రకారం పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ పెళ్లి పనుల బిజీలో ఉండటం వలన తన హిందీ డబ్యూ మూవీ బేబీ జాన్ చిత్ర ప్రమోషన్స్ కి ఇన్నాళ్లు దూరంగా ఉంది కీర్తి.
అయితే ఇప్పుడు మళ్లీ సినిమాపై ఫోకస్ పెట్టి బేబీ జాన్ ప్రమోషన్స్ లో జాయిన్ అయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కి వచ్చిన కీర్తి మెడలో మంగళసూత్రంతో, మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఈవెంట్ లో కనిపించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఎవరూ పెళ్లి అయిన తర్వాత తాళిబొట్టు వారి పనుల దృష్ట్యా మెడలో వేసుకోరు.
కానీ కీర్తి సురేష్ ఇలా కనిపించే పలువురు దృష్టిని ఆకర్షించింది. ఇక బేబీ జాన్ సినిమా కోసం నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వస్తుంది తమిళ సూపర్ హిట్ సినిమా తేరి కి ప్రీ మేక్ ఈ బేబీ జోన్ తేరి సినిమాని అట్లీ డైరెక్షన్ చేశాడు అయితే ఈ హిందీ బేబీ జోన్ మూవీ కి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు తేరి సినిమాలో సమంత మాత్రమే హిందీలో కీర్తి సురేష్ పోషిస్తుంది.
ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందని ఈ సినిమాలో తన పాత్రని అందరూ మెచ్చుకుంటారని హిందీ ఆడియన్స్ కు బాగా నచ్చుతుందని ప్రమోషన్స్ లో పాల్గొన్న కీర్తి సురేష్ చెప్పింది. ఇక ఈ సినిమా గురించి అట్లీ మాట్లాడుతూ ఈ సినిమాని తాను నిర్మించడంతో నిర్మాతలు యొక్క కష్టాలు ఎలా ఉంటాయో తెలిసాయి. తాను దర్శకత్వం చేస్తున్నప్పుడు తన నిర్మాతలు ఎంతగా ఒత్తిడి ఫీలయ్యారు ఇప్పుడు నాకు అర్థం అవుతున్నాయని చెప్పాడు.
