Manchu Manoj: మంచు మనోజ్ దాదాపు తొమ్మిది సంవత్సరాల ఇండస్ట్రీ గ్యాప్ తర్వాత ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల భైరవం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన మంచు మనోజ్ త్వరలోనే మిరాయ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించగా, మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ మంచి అంచనాలనే పెంచింది ఇక ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే మంచు మనోజ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను బయటపెట్టారు. తేజ నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. చిన్నప్పుడు వాడి బుగ్గలు గిల్లేవాణ్ణి ఏదైనా సినిమా ఉంటే చెప్పు కలసి చేద్దామనడంతో కార్తీక్ మిరాయ్ సినిమా స్టోరీ చెప్పారని ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని మనోజ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇకపోతే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ రజినీకాంత్ గారికి చూపించిన విషయం తెలిసిందే.
కూలీ సినిమా విడుదలకు ముందు రజనీకాంత్ గారు తమ ఇంటికి రావడంతో ఆయనకు మిరాయ్ సినిమా ట్రైలర్ చూపించాను. ట్రైలర్ చూసిన తర్వాత రజనీకాంత్ గారు చాలా బాగుందని మెచ్చుకున్నారు. అనంతరం ఇప్పుడైనా వరుసగా సినిమాలు చెయ్యి అంటూ నాకు క్లాస్ పీకారని మనోజ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం ఎలాంటి సెట్ వేయలేదని, చాలా న్యాచురల్గా తక్కువ బడ్జెట్ తో హాలీవుడ్ స్టైల్ సినిమాని చేసాము అంటూ మనోజ్ ఈ సందర్భంగా సినిమా పట్ల అంచనాలను పెంచుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
