ఆ స్టార్ హీరో కొడుకుని పెళ్లి చేసుకునే ఛాన్స్ మిస్ చేసుకున్న మంచు లక్ష్మి

మోహన్ బాబు సంతానం లో మంచు లక్ష్మి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు లో మొదటిసారి టాక్ షో కి నాంది పలికిన లక్ష్మి నిర్మాతగా, నటిగా, హోస్ట్ గా, బిజీ గా ఉన్నారు. అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్న లక్ష్మి ప్రస్తుతం ‘ఆహ’ లో ఒక వంటల ప్రోగ్రాం కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

అయితే తాజాగా మంచు లక్ష్మి కి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతుంది. మోహన్ బాబు టాలీవుడ్ లో టాప్ హీరో గా ఉన్న ఆ స్టార్ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట. ఆ హీరో  మంచు ఫ్యామిలీకి చాలా క్లోజ్ అని దగ్గర బంధువు అని తెలుస్తుంది .అయితే మంచు లక్ష్మి నాకు అప్పుడే పెళ్లి వద్దని చదువుకుంటానని విదేశాలకు వెళ్లిపోయిందట లక్ష్మి. అలాగే  తనకు సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్లను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని కూడా చెప్పిందంతా లక్ష్మి.

లక్ష్మి డెసిషన్ ని గౌరవిస్తూ మోహన్ బాబు ఆ సంబంధం వద్దనుకున్నాడంట. అలా బడా ఇంటి ఫ్యామిలీకి కోడలు అయ్యే చాన్స్ మిస్ చేసుకుంది మంచు లక్ష్మి.