వామ్మో మంచు లక్ష్మీ మామూల్ది కాదు.. అలా చేసేసిందేంటి?

Manchu Lakshmi Fitness Pics Goes viral

మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి మంచు లక్ష్మీ యోగా, వ్యాయామం వంటివి చేస్తుంటుంది. తానే కాకుండా అందరూ ఫాలో అయ్యేలా సూచనలు కూడా ఇస్తుంటుంది. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో పాటించాల్సిన నియమాలు,చేయాల్సిన పనులు, వేయాల్సిన ఆసనాల గురించి వివరిస్తూ ఉంటుంది. తాజాగా మంచు లక్ష్మీ షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

Manchu Lakshmi Fitness Pics Goes viral
Manchu Lakshmi Fitness Pics Goes viral

మంచు లక్ష్మీ అమాంతం తన కాలిని మీదకు లేపింది. తన తలకు కాలిని అంటించింది. అలా మంచు లక్ష్మీ చేసిన విన్యాసాలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏదైనా మిమ్మల్ని బ్రేక్ చేయలేదో అదే మిమ్మల్ని బలంగా తయారు చేస్తుంది.. దేనికీ కూడా భయపడద్దు. రోజూ మన శక్తిని పెంచుకుంటూ పోవాలి.. తప్పులు చేయాలి.. వాటిని నుంచి ఎంతో నేర్చుకోవాలి.. మనది మనల్ని నిర్మించుకోవాలి.

మీ మీద మీరు ఫోకస్ పెట్టుకోవాలి.. మిమ్మల్ని ఏది ముందుకు తీసుకెళ్తుందని భావిస్తే అదే చేయాలంటూ మంచు లక్ష్మీ షేర్ చేసింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మంచు వారి సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవ్వడంతో రెండు మూడు రోజులు అదే హాట్ టాపిక్ అయింది. ఎట్టకేలకు మంచు లక్ష్మీ, మంచు మనోజ్ సోషల్ మీడియా ఖాతాలు రికవరీ అయ్యాయి.