Manchu Lakshmi: మాస్ స్టెప్పులతో.. డీజే టిల్లుతో డ్యాన్స్‌ అదరొగొట్టిన మంచు లక్ష్మీ…!

Manchu Lakshmi: సోషల్ మీడియాలో మంచు లక్ష్మి ఎప్పుడూ ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈమె ఏం చేసినా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోతూ ఉంటుంది. ఒక వైపు సినిమాలే కాకుండా, ఫామిలీ, వెకేషన్స్‌, పార్టీలు, షూటింగులు అంటూ ఎప్పుడో ఏదో విషయం గురించి తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను నిత్యం ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి పబ్లిక్ ఆప్‌ల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. ఆ విషయాలకు సంబంధించిన పోస్టులు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూనే ఉంటారు మంచు లక్ష్మి. వెరైటీ ఫోజులతో, ఫన్నీ వీడియోలతో ఎప్పుడూ తన అభిమానులను నవ్విస్తూనే ఉండే ఈమె, తండ్రికి తగ్గ తనయ అని చాలా సార్లు పేరు కూడా తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇటీవలి కాలంలో ఒక సినిమాలో ఏదైనా సాంగ్ కాస్త మ్యూజిక్ లేదా పాట బాగున్నా కూడా హిట్‌ అవుతుంది. అలాంటి పాటలకు తమ డ్యాన్స్‌ను జోడించి రీల్స్, వీడియోలు చేయడం ప్రస్తుతం కామన్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఆ పాటనే వినిపిస్తూ, ప్రేక్షకులను కొన్ని రోజుల పాటు ఉర్రూతలూగిస్తూనే ఉంటుంది.

ఇక వివరాల్లోకి వెళితే, ఈ మధ్య కాలంలో అలాంటి పాట ఒకటి ఫేమస్ అయ్యి, చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ వినగానే స్టెప్పులు వేసేంత ఊపున్న సాంగ్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ మారింది. అదే డీజే టిల్లు సినిమాలోని డీజే టిల్లు సాంగ్. ఆ పాటకి ఈ మధ్య కాలంలో వస్తున్న క్రేజ్ చూసి అంతా ఆశ్చర్యపోవడంలో సందేహమేమీ లేదు. అదే పాటకు సెలబ్రెటీలు ఆడితే వచ్చే పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఇంతకీ ఆ సెలబ్రెటి ఎవరనుకున్నారు? మన మంచు లక్ష్మీ, హీరో జొన్నలగడ్డ సిద్దుతో అమన్. వీరు ముగ్గురూ కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ, తమ మాస్ స్టెప్పులతో కూడిన ఓ వీడియోను మంచు లక్ష్మీ పోస్ట్ చేయడంతో ఇప్పుడది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎవరేమనుకున్నా తన దారిలో తనకు నచ్చినట్లుగా ఉండే మంచు లక్ష్మీ పోస్ట్ చేసిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.