సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. మంచు లక్ష్మీ ఈ మధ్య తన కూతురు విద్యా నిర్వాణను కూడా ఫుల్ పాపులర్ చేసేస్తోంది. ఆ మధ్య అతికష్టమైన శ్లోకాన్ని పాడేసింది. చిట్టి చిలకమ్మ అంటూ యూట్యూబ్ చానెల్‌లో తల్లీ కూతుళ్లు రచ్చ చేశారు. ఈ ఇద్దరూ కలిసి యోగా, జిమ్మాస్టిక్స్ చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంటారు.
అది జిమ్ అయినా యోగా అయినా ఏదైనా సరే అందులో తల్లీతో కూతురు.. కూతురితో తల్లీ ఇద్దరూ పోటీపడుతూ ఉంటారు. ఈ ఇద్దరూ కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదు. ప్రతీ ఆదివారం వస్తే చాలు తాత మోహన్ బాబుతో మంచు లక్ష్మీ కూతురు చేసే అల్లరి ఓరేంజ్‌లో ఉంటుంది. ప్రతీ ఆదివారం తన తాత దగ్గరి అటెండెన్స్ వేసుకోవాల్సిందేనని చెబుతూ ఉంటుంది.
తాజాగా మంచు వారింట్లో దీపావళి, బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. చిల్డ్రెన్స్ డే సందర్భంగా మంచు వారింట్లో బుట్టబొమ్మ స్టెప్పులు వైరల్ అయ్యాయి. మంచు లక్ష్మీ, నిర్వాణ ఇద్దరూ కలిసి బుట్టబొమ్మ స్టెప్పులు వేశారు. నేను ప్రస్తుతం ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నివి. అందుకే నివికి థ్యాంక్స్. ఓ తల్లిగా ఇలా స్ట్రాంగ్‌గా ఉండేందుకు కావాల్సిన శక్తిని ఇచ్చిందంటూ కూతురిని పొగిడేసింది.