మహమ్మారీ సీజన్ ని ఒక్కొక్కరూ ఒక్కోలా మ్యానేజ్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్లంతా ఇళ్లకే అంకితమై రెగ్యులర్ వ్యాపకాల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా కలెక్షన్ కింగ్ వారసుడు మంచు విష్ణు వంతు వచ్చింది. అతడు కూడా ఇన్ స్టాలో యాక్టివ్ గానే ఉన్నాడు. తాజా పోస్ట్ ఆసక్తిని పెంచుతోంది.
హీరో విష్ణు మంచు ఈ మహమ్మారి సీజన్ ని కుటుంబంతో జాలీగానే స్పెండ్ చేస్తున్నాడు. తన ఖాళీ సమయాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్నాడు. కుటుంబం కిడ్స్ కోసం చాలావరకూ.. సమయాన్ని వెచ్చిస్తున్నాడు. అలాగే తన భవిష్యత్ ప్రాజెక్టులను కూడా ప్లాన్ చేస్తున్నాడు. అతను ఈ సాయంత్రం ఇన్ స్టాగ్రామ్ లోకి వెళ్లి తన కొత్త అవతారాన్ని పంచుకున్నాడు.
“గడ్డం అవతారంలో విష్ణు ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. “గడ్డంతో జీవించడం! వైకింగ్ ఇన్ మేకింగ్! నచ్చిందా?“ అని విష్ణు ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చాడు. ఈ లుక్ అతని తదుపరి ప్రాజెక్టులకు సంబంధించినదా కాదా? అనేది త్వరలో తెలుస్తుంది. విష్ణు నటిస్తున్న హాలీవుడ్ చిత్రం `మోసగాళ్లు`. అలాగే వెబ్ కోసం కొన్ని ప్రాజెక్టులతో బిరిలోకి వస్తున్నాడు. తాజా క్రైసిస్ క్లియరైతే క్లారిటీ వచ్చేస్తుంది.
అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పటికే మెగా హీరోలతో పోలిస్తే మంచు ఫ్యామిలీ కెరీర్ పరంగా వెనకబడింది. ఇటీవల మెగా హీరోలు అంతకంతకు రైజ్ అవుతుంటే వీళ్లు మాత్రం నిల్ అయిపోయారు. అందుకే విష్ణు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారనుకోవచ్చా?