మ‌ల్లిక ఇంత మూడీగా ఉందేంటి , బ‌స్తీ బాల‌రాజు ఏమ‌న్నాడు ?

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న ఆస‌క్తిక‌ర చిత్రాల‌లో చావు క‌బురు చ‌ల్లగా. ఎన‌ర్జిటిక్ హీరో కార్తికేయ‌, గ్లామ‌ర్ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నూత‌న ద‌ర్శకుడు కౌశిక్ పెగ‌ళ్ళ‌పాటి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలతో దూసుకుపోతోన్న ‌బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన కార్తికేయ లుక్ కొద్ది రోజుల క్రితం విడుద‌ల కాగా, మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా చిత్రం నుండి లావ‌ణ్య త్రిపాఠి లుక్ విడుద‌ల చేశారు. ఇందులో ఆమె చాలా మూడీగా క‌నిపిస్తుంది.

అందాల రాక్ష‌సి చిత్రంతో ఆకట్టుకుని మంచి పేరు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి మ‌ధ్య‌లో మంచి ఇంట్రెస్టింగ్ చిత్రాలు చేసింది. ఆ త‌ర్వాత అమ్మ‌డికి స‌రైన ఆఫ‌ర్స్ రాక‌పోవ‌డంతో గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించింది. ఇప్పుడు లావ‌ణ్య త్రిపాఠికి సంబంధించి రెండు చిత్రాలు సెట్స్ పై ఉండ‌గా, తాజా చిత్రం చావు క‌బురు చ‌ల్లగా మూవీపై ఎన్నో ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకుంది. బ‌స్తీ బాల‌రాజుగా న‌టిస్తున్న కార్తికేయ‌తో మ‌ల్లిక పాత్ర‌లో న‌టిస్తున్న లావ‌ణ్య త్రిపాఠి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందోన‌ని అభిమానులు అనేక ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రానికి సునీల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండ‌గా, జకీస్ బీజాయ్ సంగీతం అందిస్తున్నారు. లావణ్య లుక్‌ విడుదల సందర్భంగా నిర్మాత బ‌న్నీ వాసు మాట్లాడుతూ.. ”జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌, గీత గోవిందం, ప్ర‌తిరోజూ పండ‌గే చిత్రాలు ఘ‌న‌ విజయాలు సాధించాయి. ఈ చిత్రం కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిస్తున్నాం. బస్తీ బాల‌రాజుగా టీజ‌ర్‌లో చూపించాం. అలానే ఇప్పుడు లావ‌ణ్య త్రిపాఠిని మ‌ల్లికగా ప‌రిచ‌యం చేశాం. మ‌ల్లిక పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. లావ‌ణ్య పాత్ర ప్ర‌తి ఒక్క‌రికి గుర్తుండిపోయేలా ఉంటుంది. ద‌ర్శ‌కుడు కొత్త వాడైన కూడా మంచి టాలెంట్ ఉన్నవాడు. రెగ్యుల‌ర్ చిత్రంగా కాకుండా కాస్త డిఫ‌రెంట్‌గా మూవీని తెర‌కెక్కిస్తున్నాం. ఇది అంద‌రిని ఆకట్టుకుంటుంద‌ని చెప్పుకొచ్చారు.