Hyper Aadi: వారిపట్ల దారుణంగా ప్రవర్తిస్తున్న మల్లెమాల… అప్పుడు ఢీ,ఇప్పుడు జబర్దస్త్!

Hyper Aadi: బుల్లితెర మీద ప్రసారమవుతున్న కామెడీ షో లలో జబర్దస్త్ కామెడీ షో మంచి ప్రేక్షకాదరణ పొంది ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉంది. జబర్దస్త్ కొన్ని సంవత్సరాలుగా ఇంత సక్సెస్ కావడానికి కారణం అందులో కమెడియన్లు వేసే స్కిట్స్. అయితే ఈ జబర్దస్త్ షో తో పాటు ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఢీ డాన్స్ రియాలిటీ షో , ఇటీవల మొదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు కూడా మల్లెమాల ప్రొడక్షన్ లో నిర్మితమవుతున్నాయి. ఢీ షో లో డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా సుధీర్ , రష్మి మద్య జరిగే సిల్లీ ఫైటింగ్ వల్ల ఈ షో మరింత పాపులర్ అయ్యింది.

అయితే గత కొంతకాలంగా సుధీర్, రష్మీ ఢీ షోలో కనిపించకపోవటంతో ప్రేక్షకాదరణ తగ్గిందని చెప్పడంలో సందేహం లేదు. ఈ విధంగానే జబర్దస్త్ లో కూడా ఎంతోమంది రెమ్యునరేషన్ కారణంగా జబర్దస్త్ విడిచి వెళ్లిపోతున్నారు. ఇటీవల అదిరే అభి కూడా జబర్దస్త్ నుండి కామెడీ స్టార్ షో కి వెళ్ళాడు. అయితే జబర్దస్త్ కామెడీ షో కి మూలస్తంభం లా ఉన్న హైపర్ ఆది కూడా గత నాలుగు వారాలుగా జబర్దస్త్ లో కనిపించడం లేదు.

ఆది జబర్దస్త్ లో కనిపించకపోవటంతో ప్రేక్షకులలో పలు అనుమానాలు రేకెత్తాయి. ఈ తరుణంలో ఈ టీవీ ఆఫ్ ఇటీవల ప్రసారమౌతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా ఆది కనిపించకపోవడంతో అందరి అనుమానాలు తీరిపోయాయి. జబర్దస్త్ కి మంచి పేరు తెచ్చి పెట్టిన ఆది రెమ్యునరేషన్ కొంచెం పెంచాలంటూ మల్లెమాల వారిని కోరగా..అందుకు వారు స్పందించక పోవడంతో హైపర్ ఆది వెళ్లిపోయాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా రెమ్యూనరేషన్ విషయంలో మల్లెమాల నుండి పట్టుపట్టడంతో ఒక్కొక్కరుగా జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకుంటున్నారు. ఇలా ఒక్కొక్కరు వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమం తీవ్రంగా నష్టపోవాల్సి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.