హిట్టు హీరోయిన్‌పై దుష్ప్రచారం.!

ఒక్క హిట్టు కొడితే చాలు.. ఆ హీరోయిన్‌ క్రేజ్ అమాంతం పెరిగిపోతుంటుంది. అలాంటిది.. సంయుక్తా మీనన్ వరుసగా హిట్లు మీద హిట్టు కొడుతోంది. మరి క్రేజ్ పెరగకుండా ఎలా వుంటుంది. క్రేజ్ పెరిగిందంటే చాలు.. ఆటోమెటిగ్గా రెమ్యునరేషన్ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడదే స్టేటస్‌లో వుంది సంయుక్తా మీనన్.

లేటెస్ట్‌గా ‘విరూపాక్ష’ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. అంతకు ముందే ‘సార్’ సినిమాతో హిట్టు కొట్టి జోష్ మీదుంది. తాజాగా ‘విరూపాక్ష’ హిట్ ఈ మలయాళ కుట్టి ఇమేజ్‌ని అమాంతం పెంచేసింది. దాంతో, రెమ్యునరేషన్ గట్టిగా డిమాండ్ చేస్తోందట. అందులోనూ గోల్డెన్ లెగ్ బ్యూటీ అనే ట్యాగ్ కూడా వేయించేసుకుందాయె.

సో, అమ్మడు ఎంత చెబితే అంతే. ఇదే అదనుగా సంయుక్తా మీనన్‌పై ఒక కొత్త ప్రచారం ఊపందుకుంది. రెమ్యునరేషన్ డిమాండ్‌తో పాటూ, ప్రమోషన్లలోనూ సంయుక్త కాస్త కిరికిరి చేస్తోందనీ అంటున్నారు. అయితే, ప్రమోషన్లలో సంయుక్త చాలా యాక్టివ్. తన స్పేస్‌ని బాగానే ఆక్యుపై చేస్తుంటుంది. తెలుగులో చక్కగా మాట్లాడుతూ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తుంటుంది. నిండైన డ్రస్సింగ్‌తో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటుంది.

అయితే, అమ్మడు కాస్త డైనమిక్ అండోయ్. అదే ఆమె కొంప ముంచేస్తోంది.