ఆమెను తట్టుకోవడం కష్టమే సుమీ.!

మాళవిక మోహనన్ తెలుసు కదా.! ఇప్పటివరకు అయితే ఆమె డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. అయితే, స్ట్రెయిట్ తెలుగు సినిమా ఎప్పుడో చేయాల్సి వున్నా, ఓ సినిమా ప్రారంభమై మధ్యలో ఆగిపోయింది.

ప్రస్తుతానికైతే ప్రభాస్ – మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరో తెలుగు సినిమాకి కూడా ఈ బ్యూటీ కమిట్ అయ్యిందటగానీ, ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

మాళవిక మోహనన్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ చాన్నాళ్ళ క్రితం ‘హీరో’ అనే సినిమా ప్రారంభించింది. ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. సినిమా కోసం మాళవిక బాగానే కష్టపడిందండోయ్.. అది వేరే చర్చ.

కానీ, కథల ఎంపిక దగ్గర్నుంచి చాలా విషయాల్లో మాళవిక మోహనన్ చాలా కఠినంగా వ్యవహరిస్తుంటుందట. అంతే కాదు, రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గేదే లేదని చెబుతుంటుందిట. ఈ కోణంలోనే ఆమె తాజాగా రెండు సినిమా ఛాన్సుల్ని తెలుగులో తిరస్కరించిందిన చెబుతున్నారు.

‘ఆమెని తట్టుకోవడం కష్టం. గొంతెమ్మ కోర్కెలు కోరుతుంటుంది..’ అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి మాళవిక మోహనన్ గురించి. కానీ, ఆమె మాత్రం తాను అందరికీ అందుబాటులో వుంటాననీ, గాసిప్స్ విషయంలో తన వద్ద క్లారిటీ తీసుకోవచ్చనీ చెబుతోందిట.

నిప్పు లేకుండా పొగ రాదు కదా బ్యూటీ.!