ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కం బ్యాక్ అయిన పూరి ఒకేసారి రెండు సినిమాలని ప్రారంభించాడు. అందులో ఒక సినిమా కొడుకు ఆకాష్ పూరి తో కాగా మరొక సినిమా టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో చేస్తున్నాడు. అయితే కొడుకు నటిస్తున్న రొమాంటిక్ సినిమాకి పూరి కథ అందివ్వడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి, ఛార్మి నిర్మిస్తున్నారు. పూరి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్ పాదూరి ఈ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
రమ్యకృష్ణ ఈ సినిమాలో ఆకాష్ కి తల్లిగా కనిపించబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఆకాష్ కి జంటగా కేతిక శర్మ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. మొదటి సినిమా మెహబూబా ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో ఈ సినిమా ఎలాగైనా సక్సస్ అవ్వాలన్న కసితో రూపొందించారు. కాగా ఈ సినిమా ఇటీవలే టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని జరుపుకుంటుందట.
అలాగే విజయ్ దేవరకొండతో పూరి ఫైటర్ తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ – అనన్య పాండే ల మీద కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించాడు పూరి. ఈ వర్కింగ్ స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఇప్పుడు పూరి పరిచయం చేస్తున్న కేతిక శర్మ, అనన్య పాండే ల గురించి మేకర్స్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. యంగ్ హీరోలు నటించే సినిమాలలో హీరోయిన్స్ గా డేట్స్ లాక్ చేసుకునేందుకు పూరి హీరోయిన్స్ వెనకాల పడుతున్నట్టు తెలుస్తుంది.