ఆ హీరోయిన్ తో సినిమా వద్దంటూ డైరెక్టర్ కి దండం పెట్టిన మహేష్?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కలిసి ఒక సినిమాలో నటించి మంచి హిట్ అయింది అంటే తిరిగి ఆ కాంబినేషన్ రిపీట్ కావడం సర్వసాధారణం.ఇలా ఒకే జంట రెండు మూడు సినిమాలలో నటిస్తే వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు కూడా వస్తుంటాయి. ఇలా ఎంతో మంది సెలెబ్రెటీలు ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇలా ఫేమస్ అయిన జంటలలో మహేష్ బాబు సమంత జంట కూడా ఒకటి.

మహేష్ బాబు సమంత ఇద్దరు కలిసి దూకుడు బ్రహ్మోత్సవం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలలో నటించారు. మహేష్ బాబు ఏ సినిమాలో నటించిన ఏ హీరోయిన్ తో ఎలాంటి గాసిప్స్ రాకుండా తన లిమిట్స్ వరకు తాను నటిస్తూ ఎంత పేరు ప్రఖ్యాతలు పొందారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు సమంత కాంబినేషన్లో వచ్చిన దూకుడు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు బ్లాక్ బాస్టర్ ఆయన విషయం మనకు తెలిసిందే.

ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడమే కాకుండా వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా ఎక్కువైంది అంటూ వార్తలు వచ్చాయి. దీంతో మరోసారి మహేష్ బాబు సినిమాలో సమంత హీరోయిన్ గా బ్రహ్మోత్సవం సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబు దర్శకుడితో ఆ హీరోయిన్ తో సినిమా వద్దు అంటూ చెప్పినట్లు సమాచారం. అయితే మహేష్ బాబుతో సినిమా చేయడం కోసమే సమంత బ్రహ్మోత్సవం సినిమాకు కమిట్ అయిందని తెలుస్తోంది.అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ సంపాదించుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమాలు రాలేదు.