అలనాటి స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల తుది శ్వాస విడిచితే సంగతి అందరికీ తెలిసిందే. అనారోగ్య కారణాలవల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇందిరాదేవి సెప్టెంబర్ 28వ తేదీ మరణించారు.
తల్లి మరణంతో మహేష్ బాబు కుటుంబంతో పాటు యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీ శోకంలో మునిగిపోయింది. ఇందిరా దేవికి మహేష్ బాబు అంటే ప్రాణం. మహేష్ బాబు కూడా తన తల్లిని ప్రాణంగా చూసుకున్నాడు. ఇక ఆమె మరణించిన తర్వాత మహేష్ బాబు దగ్గరుండి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. ఇక ఇటీవల ఇందిరా దేవి అస్థికలను మహేష్ బాబు గంగానదిలో నిమజ్జనం చేశాడు.
ఇందిరా దేవి మరణించిన తర్వాత ఐదవరోజు హరిద్వారలోని గంగానది వడ్డున పండితుల సమక్షంలో పూజ నిర్వహించిన మహేష్ స్వయంగా తన తల్లి అస్తికలను గంగానదిలో నిమజ్జనం చేసారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటువంటి ఫోటోలు తీయటానికి మహేష్ బాబు నిరాకరించినప్పటికీ.. అనధికారికంగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది.