ఈశ్వర్ సినిమాపై మనసు పడిన మహేష్.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్?

Bollywood Beauties To Tollywood

ప్రభాస్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ జయంత్ సి. పర్జానీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈశ్వర్.ప్రభాస్ హీరోగా నటుడు విజయ్ కుమార్ చిన్న కుమార్తె శ్రీదేవి హీరోయిన్ గా ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా 2002 నవంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా విడుదల 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో తాజాగా డైరెక్టర్ జయంత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను ఈ సినిమా చేయలేదని తక్కువ బడ్జెట్లో విభిన్నమైన ప్రేమ కథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చామని తెలిపారు.ఇక మహేష్ బాబు తనకు మంచి స్నేహితుడు కావడంతో ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ లొకేషన్ లోకి వచ్చారని అందుకు సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేశారు.ఇక మహేష్ బాబు తనకు చాలా క్లోజ్ కావడంతో సినిమా విడుదలకు రెండు రోజుల ముందు ఈశ్వర్ సినిమాని తనకి చూపించాలని జయంత్ వెల్లడించారు.

ఈ సినిమా చూసిన అనంతరం మహేష్ బాబు.. సినిమా ఎంతో అద్భుతంగా ఉందని ఈ సినిమా నాతో చేయొచ్చు కదా అంటూ ఈశ్వర్ సినిమాపై మహేష్ బాబు మనసు పడ్డారంటూ ఈ సందర్భంగా జయంత్ తెలిపారు.అయితే ప్రభాస్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈ సినిమా పెద్దగా కమర్షియల్ హిట్ కాలేదని విషయాన్ని కూడా డైరెక్టర్ ఈ సందర్భంగా ఒప్పుకున్నారు.ఇక ఈ సినిమా శుక్రవారం కాకుండా సోమవారం విడుదల కావడంతో పెద్దగా జనాలకు రీచ్ కాలేకపోయిందనీ అదే ఈ సినిమా సక్సెస్ కాకపోవడానికి కారణమని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.