ప్రస్తుతం టాలీవుడ్ దగ్గర ఉన్న పలు సాలిడ్ మాస్ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సూపర్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం” కూడా ఒకటి. అయితే అడ్డంకులు సినిమా మొదలైన నాటి నుంచి చాలానే ఉన్నప్పటికీ..
ఈ చిత్రం రిలీజ్ విషయంలో కానీ ఇపుడు వరకు చేస్తున్న అవుట్ పుట్ విజయంలో కానీ మేకర్స్ మాత్రం సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా ఇప్పుడు కంప్లీట్ అవుతుండగా ఓ ఊహించని గాసిప్స్ అయితే సినీ వర్గాల్లో వినిపిస్తుంది.
మహేష్ రీసెంట్ గానే సడెన్ గా అయ్యితే షూటింగ్ ని ఆపేసాడట. అది కూడా తన పెంపుడు కుక్క కోసం ఆపేసాడని వినిపిస్తుంది. అయితే మహేష్ బాబు తన ఇంట్లో ప్రేమగా కుక్కని కూడా పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. మరి తన ఇటీవలే అనారోగ్యంతో చనిపోవడంతో ఈ విషయం తెలిసిన మహేష్ బాబు షూటింగ్ ఆపించేసి వెళ్లిపోయాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఇది వినడానికి కొందరికి వింతగా ఉండొచ్చు కానీ డాగ్ లవర్స్ కి అయితే ఆ విలువ అర్ధం అవుతుంది. ఇక ఈ చిత్రంలో శ్రీ లీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12న విడుదల కాబోతుంది.