శ్రీలీలని సెట్ చేసిన మహేష్ బాబు??

తెలుగు సినిమా దగ్గర వచ్చిన అతి కొద్ది టైం లోనే యంగ్ హీరోయిన్ శ్రీలీల అయ్యినంత బిజీ గడిచిన దశాబ్ద కాలంలో ఎవరూ అయ్యి ఉండకపోవచ్చు. మరి ఆ రేంజ్ లో ఆఫర్స్ దక్కించుకుని అదరగొట్టిన శ్రీలీల జస్ట్ గడిచిన 6 నెలల్లో వరుస సినిమాలు ఆమె నుంచి రిలీజ్ కి తీసుకొచ్చింది.

కానీ ఈమె నటించిన స్టార్టింగ్ దశలో సినిమాలు తప్ప నెక్స్ట్ వచ్చిన సినిమాలు ప్లాప్ లు లేదా డిజాస్టర్ లు ఒక్కటి రెండు యావరేజ్ గా నిలిచాయి. దీనితో శ్రీలీల పని అయిపోయింది అని ఇంకా ఆమె ఉంటే సినిమా ప్లాప్ అంటూ కూడా కొన్ని మాటలు వైరల్ అయ్యాయి.

దీనితో ఇదే సెంటిమెంట్ ప్రకారం తాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించిన చిత్రం “గుంటూరు కారం” కూడా అలాగే ప్లాప్ అవుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ చిత్రం రిలీజ్ అయ్యాక టాక్ కొంచెం అటు ఇటుగానే వచ్చింది. దీనితో మళ్ళీ శ్రీలీల ఫ్యాక్టర్ ని యాడ్ చేసారు.

దీనితో గుంటూరు కారం కూడా ప్లాప్ అనే టాక్ మొదలయింది. అయితే ఇది ఇక్కడితో అయిపోలేదు తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం సినిమా స్వల్పంగా రాణించడం స్టార్ట్ చేస్తుంది. దీనితో మహేష్ బాబు ఏమాత్రం ఈ సినిమాతో గట్టెక్కినా శ్రీలీల ఫేట్ ని మార్చినవాడే అవుతాడని చెప్పవచ్చు. మరి లాంగ్ రన్ లో అయితే శ్రీలీల కెరీర్ లో మరో హిట్ అందుకుందా ప్లాప్ అందుకుందా అనేది ఆగి చూడాలి.