తెలుగు సినిమా స్థాయిని పెంచేలా మరో వేడుక జరగనుంది. ఆర్ఆర్ఆర్ సంగీత ప్రదర్శనకు ప్రపంచ ప్రఖ్యాత రాయల్ అల్బర్ట్ హాల్ వేదిక కావడం, తెలుగు ఇండస్ట్రీ స్థాయిని గ్లోబల్‌గా మరోసారి చూపించింది. అయితే ఈ వేడుకలో మ్యూజిక్ కన్నా ఒక విషయం ఎక్కువగా చర్చనీయాంశం అయింది.. అదే ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు టాప్ స్టార్లు: మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ కనిపించనున్నారు.
ఇటీవలే మేడమ్ టుస్సాడ్స్ విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్‌కు వెళ్లిన రామ్ చరణ్, ఈ మెగా ఈవెంట్‌కు హాజరవుతున్నారు. మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే షో కోసం సిద్ధమయ్యారు. ప్రత్యేక అతిథిగా రాజమౌళి ఆహ్వానంతో మహేష్ బాబు హాజరవుతుండటంతో ఈ ముగ్గురి కలిసి కనిపించనున్న తీరు అభిమానుల్ని ఉత్కంఠకు గురిచేస్తోంది. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడంతో ఆ పాట ప్రదర్శనపై ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు అదే వేదికపై మహేష్, తారక్, చరణ్ సైడ్ బై సైడ్ కనిపిస్తే, అది తెలుగు సినిమా కోసం ఓ చరిత్రాత్మక క్షణం అవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఒకే ఫ్రేమ్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరి కలయికలో ఒక ఫోటో వచ్చినా చాలు… సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ అవ్వడం ఖాయం. ఇక మహేష్ తాజా లుక్ ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. ఇటువంటి కార్యక్రమాలు కేవలం సంగీత ప్రయోగాలుగా కాదు… భారతీయ సినిమాకి గ్లోబల్ గౌరవాన్ని తీసుకురావడంలో కీలకంగా నిలుస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ కాన్సర్ట్‌తో పాటు స్టార్ హీరోల హాజరవ్వడంతో… ఇది ఖచ్చితంగా ఒక స్ఫూర్తిదాయకమైన క్షణంగా నిలిచిపోతుంది.