Mahesh Babu:సూపర్ స్టార్ మహేష్ బాబు అనగానే అందగాడు అంటారు. ఈ మాట అమ్మాయిలే కాదు అబ్బాయిలు ఒప్పుకుంటారు. నాలుగు పదుల వయసులో కుడా కుర్రాడిలా అందంగా క్యూట్ లుక్ తో అందరిని ఆకట్టుకుంటారు సూపర్ స్టార్. అయితే ఆ అందాన్ని కాపాడుకోవాలంటే సెలబ్రిటీలు ఎంత కష్టపడాలో కూడా అపుడప్పుడు వారు షేర్ చేసే జిమ్ వీడియోలు, డైట్ ఫుడ్ ఫోటోలు చూస్తే కానీ మనకు వారి అందం వెనుక కష్టం తెలియదు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుకు మోకాలు సర్జరీ దుబాయ్ లో జరిగింది. ఆ చికత్స తర్వాత మహేష్ మళ్ళీ ఫిట్నెస్ కోసం జిమ్ లో కసరత్తులు మొదలు పెట్టారు.
పాత వీడియోనో, ప్రెజెంట్ వీడియోనో తెలియదు కానీ జిమ్ లో మహేష్ కష్టపడుతున్న వీడియో ఒకటి ఇపుడు వైరల్ అవుతోంది. సినిమా కోసం కావాల్సిన అకృతికి రావడానికి మన హీరో హీరోయిన్స్ పడే కష్టాలు అన్ని ఇన్నీ కావు. ఇక రాబోతున్న మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట నుండి కళావతి పాట రిలీజ్ చేసారు సినీ యూనిట్ తక్కువ టైంలోనే ఈ పాట యూట్యూబ్ తో మొదలు అన్ని సంగీత మధ్యమాల్లోను ట్రెండ్ అయింది. ఇక సినిమా షూటింగ్ చివరి దశ కు చేరుకుంది.
ఇక మహేష్ తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా రాబోతోంది. ఇక రాజమౌళితో కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యాడు మహేష్ బాబు. ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారు రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్. ఇలా వరుస సినిమాలతో మహేష్ బాబు బిజీ అయ్యారు.ఇక ప్రస్తుతం మహేష్ బాబు ఫిట్ నెస్ కోసం జిమ్ లో కసరత్తులు చేస్తున్నటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.