టాలీవడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు చేస్తున్న క్రేజీ చిత్రం “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా ఇప్పుడు షూటింగ్ మంచి బ్రిస్క్ పేస్ లో అయితే దూసుకెళ్తుంది.
ఇక నిన్ననే త్రివిక్రమ్ బర్త్ డే కానుకగా చిత్ర బృందం సినిమా మొదటి సాంగ్ దం మసాలాని రిలీజ్ చేయగా ఈ సాంగ్ అయితే ఇప్పుడు యూట్యూబ్ లో దంచి కొడుతోంది. త్రివిక్రమ్ అండ్ సంగీత దర్శకుడు థమన్ మార్క్ లో అయితే ఈ చిత్రం ఉండగా సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది.
అయితే ఇందులో కొన్ని లైన్స్ మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకోగా ఈ సాంగ్ మాత్రం టాలీవుడ్ లో ఏ సాంగ్ కి కూడా రాని సెన్సేషనల్ అండ్ ఆల్ టైం రికార్డు రెస్పాన్స్ వచ్చినట్టుగా మేకర్స్ చెప్తున్నారు. మరి ఈ సాంగ్ కి ఏకంగా 19.2 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి.
అంటే సుమారుగా 2 కోట్ల దగ్గరకి వ్యూస్ వచ్చేసాయి. దీనితో ఈ సాంగ్ మన టాలీవుడ్ లోనే ఒక హైయెస్ట్ వ్యూస్ వచ్చిన సాంగ్ గా ఇప్పుడు నిలిచి దూసుకెళ్తుంది. కానీ ఇంట్రెస్టింగ్ గా ఈ సాంగ్ కి ఎలాంటి లైక్స్ రికార్డు మాత్రం దక్కలేదు. ఇంకా ఈ చిత్రంలో హీరోయిన్స్ గా శ్రీలీల, మీనాక్షి చౌదరిలు నటిస్తుండగా ప్రకాష్ రాజ్ జగపతిబాబు తదితరులు కూడా నటిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి లో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం అయితే విడుదల కాబోతుంది.
Reigning SUPER 🌟 @urstrulyMahesh STRIKING HOT!! 🌶💥#RecordBreakingDumMasala 😎#DumMasala ~ MOST VIEWED Telugu song ever with a HUGE 𝟏𝟗.𝟐 𝐌+ views in 𝟐𝟒 𝐇𝐨𝐮𝐫𝐬 – 𝐀𝐋𝐋 𝐓𝐈𝐌𝐄 𝐑𝐄𝐂𝐎𝐑𝐃 🔥
𝐓𝐑𝐄𝐍𝐃𝐈𝐍𝐆 𝐓𝐎𝐏 #𝟏 on #YouTube – https://t.co/En34oasPZ0
— Haarika & Hassine Creations (@haarikahassine) November 8, 2023