“SSMB28” నుంచి నెక్స్ట్ బ్లాస్ట్ కన్ఫర్మ్ చేసిన నిర్మాత.!

టాలీవుడ్ ఎవర్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తున్న సాలిడ్ చిత్రం కూడా ఒకటి. కాగా ఈ సినిమాని అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా రీసెంట్ గా రిలీజ్ డేట్ తో అయితే ఇచ్చిన పోస్టర్ తో రేంజ్ లో అంచనాలు ఈ సినిమా సెట్ చేసుకుంది.

అయితే ఇదే బిగ్గెస్ట్ అప్డేట్ అనుకుంటే ఇక మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ని రెడీ చేస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఈ సినిమా నిర్మాత నాగవంశి లేటెస్ట్ గా మాట్లాడుతూ నెక్స్ట్ అప్డేట్ అయితే సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్ డే కానుకగా అయితే ఈ మే నెలలో అందిస్తామని కన్ఫర్మ్ చేశారు.

దీనితో అయితే ఇక నెక్స్ట్ బ్లాస్ట్ మాత్రం వచ్చే మే లో ఉంటుంది అని చెప్పాలి. కాగా అప్పుడు అయితే సినిమా కి టైటిల్ ఏంటి అనేది ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇప్పటికే ఫస్ట్ పోస్టర్ తో అయితే ఓ రేంజ్ లో హైప్ ని రేపింది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఎలా ఉంటుందో చూడాలి.

కాగా మొదట త్రివిక్రమ్ అయితే ఈ సినిమాకి భారీ ఏక్షన్ సినిమాగా ప్లాన్ చేయగా ఇప్పుడు కథ మార్చి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా అయితే ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ కథ ఎలా ఉంటుందో చూడాలి. కాగా ఈ సినిమాకి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్నారు.