మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ బాలీవుడ్ లో నటిస్తున్న మొట్టమొదటి మూవీ బేబీ జాన్ ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా సల్మాన్ ఖాన్ కామియో రోల్ లో నటిస్తున్నాడు.ఈ సినిమాని జియో స్టూడియోస్ అసోసియేషన్స్ లో అట్లీ, సినీ 1 స్టూడియోస్ కలిసి ఆపిల్ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మించారు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ తో పాటు సాంగ్స్ కూడా సినిమాపై అంచనాలని పెంచేశాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ అయి సినిమా పై మరింత హైప్ ని పెంచేసింది. ఈ సినిమా ట్రైలర్ ని పూణేలో రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సినిమా తెరి అనే తమిళ సినిమాకి రీమేక్ అనే విషయం తెలిసిందే, అయితే ఈ సినిమా రీమేక్ మూవీలా కాకుండా పూర్తి మాస్ సినిమాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు.
అటు క్లాస్ ఇటు మాస్ కలగలిపి అన్నట్లు ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. ఈ సినిమా ఈవెంట్ లో బేబీ జాన్ నిర్మాత మురాద్ కేతని మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్ యొక్క రెస్పాన్స్ అదిరిపోయింది, సినిమా అందరికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అని చెప్పారు. అలాగే తెరి సినిమా దర్శకుడు అట్లీ మాట్లాడుతూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటూనే సమాజంలో జరుగుతున్న క్రిటికల్ ఇష్యూస్ గురించి ప్రస్తావించారు.
మంచి తండ్రి ఎలా ఉండాలో చెప్పే సినిమా, పిల్లల్ని ఎలా పెంచాలి? పేరెంటింగ్ షేప్ ఎలా ఉంటే సొసైటీ బాగుంటుంది అన్నది ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది అని చెప్పారు. కలీస్ డైరెక్ట్ చేసిన బేబీ సినిమాలో వరుణ్ ధావన్ కీర్తి సురేష్ వామికా గబ్బి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించారు సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంది ఇక సినిమా ఎలా ఉందో తెలియాలంటే డిసెంబర్ 25 వరకు ఆగాల్సిందే.