Bigg Boss 5 Telugu: రోజు రోజు కి బిగ్ బాస్ హౌస్ లో షన్ను, సిరి ల ఫ్రెండ్ షిప్ వ్యవహారం బాగా హైలైట్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం వీళ్ళ స్నేహం కొత్త పుంతలు తొక్కడమే. ఎప్పుడు సిరి నామస్మరణ చేస్తున్న షన్ను ప్రతి చిన్న విషయాన్ని భూతద్దం లో పెట్టి చూస్తూ సిరి మీద పెత్తనం చలాయిస్తున్నాడన్న వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సిరి ఎప్పుడు ఏం చెయ్యాలి? ఎవరితో మాట్లాడాలి? ఎలా ఉండాలి? అనేది కూడా షన్ను నే నిర్ణయిస్తున్నాడు. ఇది చూసిన ప్రేక్షకులు అంతా షన్ను మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, షన్ను – సిరి ల వ్యవహారం మీద ఫైర్ అయిన మాధవీలత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో షణ్ముఖ్ ప్రవర్తనను దుమ్మెత్తి పోస్తూ సిరి ని సైతం ఏకి పారేసింది. “సిరిది సిగ్గు లేని జన్మ, ఆఫర్ల కోసం ఎంతకైనా దిగజారిపోతోంది, ఎంత తిట్టినా సరే వాడితోనే తిరుగుతుంది.. ఓట్ల కోసం, వచ్చే నోట్ల కోసం మరి ఇంత దిగజారిపోవాలా?! బిగ్ బాస్ లాంటి ప్లాటుఫారం మీద తల్లిని అవమానిస్తున్న లెక్క చెయ్యకుండా ఇంకా వాడిని కన్నా అంటూ పిలుస్తున్నావు.. నీ పార్టనర్ శ్రీహన్ ని చోటు అని పిలుస్తావు… నువ్వు మహానటివే.. బంధాలు అనుబంధాలకు విలువ తెలియని బ్రతుకు నీది… బిగ్ బాస్ ముగిసాక నిన్ను భరించే నీ మొగుడికి దండమే.. మీ ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటే వచ్చే జన్మలోనైనా మంచి బుద్ధి వస్తుందే అంటూ సిరి ని దుమ్మెత్తిపోసింది మాధవిలత.