పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఎంతటి రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ పవన్ కళ్యాణ్‌కు విషెస్ తెలిపారు. ప్రేమతో తనకు విషెస్ చెప్పిన వారందరికీ పేరు పేరున పలకరిస్తూ రిప్లై ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఈ విషయంపై అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఒక్కరు తప్పా. ఆ ఒక్కరే పవన్ కళ్యాణ్ వీరాభిమాని మాధవీలత. అసలింతకీ ఏం జరిగిందంటే..
పవన్ కళ్యాణ్ అలా పేరుపేరునా రిప్లై ఇవ్వడంపై మాధవీలత మండిపడింది. ‘పోయిన ఏడాది మీరు పోటీ చేస్తుంటే వోట్ ఫర్ పవన్ కళ్యాణ్ అని ఒక పోస్ట్ పెట్టలేని వాళ్ళు, జనసేనాని ని గెలిపించండి అనలేని వాళ్ళు కనీసం మీ మీద ఎన్నో పుకార్లు పుట్టినపుడు I CONDEMN అని పోస్ట్ పెట్టలేని వాళ్ళకి మీ మీద ఈ రోజు ప్రేమ కారిపోవడం ఆ కారిన ప్రేమ మీరు బకెట్స్ లో నింపుకోవడం నాకు చాల కోపం తెప్పించింది
మీ నిజమైన అభిమానులకి పెట్టండి రిప్లై ….ఇక్కడ సెలెబ్రిటీలకి పెట్టె అవసరమే లేదు …..ఎవడికి మీ మీద ప్రేమ లేదు …..పైగా మిమ్మల్ని బద్నామ్ చేయాలనీ కొంతమంది నటీమణులు ఛానల్ మెట్లు ఎక్కుతున్నారు …అభిమానం ఉంటె కనీసం వాళ్ళ జీవితం లో మీ కోసం ఒక పోస్ట్ ఐన పెట్టేవాళ్ళు మీ జన సైనికులకు పేరు పేరున టైం ఉంటె పెట్టండి మీరు కాకపోతే మీ పేజీ అడ్మిన్స్ ఎవరో స అంతే తప్ప కెమెరాల కోసం .. వాళ్ళ పర్సనల్ మ్యానేజర్లు మీ దృష్టిలో పడటం కోసం పెట్టించే వాళ్ళకి మీరు నటిస్తూ ( ఫార్మాలిటీ )కూడా పెట్టే అవసరం లేదు ( upto ur wish ).
మీరంటే ఎంతో ఇష్టమైన ఒక మాములు ..అమ్మాయిగా నేనెపుడు మీ నుండి ఏమి ఆశ పడలేదు ..జీవితం లో ఎపుడైనా కలిసిన కేవలం ఒక మంచి ఆశయం కోసం .. మంచి విషయం కోసం కలవాలి అనుకున్న అలానే కలుస్తా’ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. ఇక తనకు పవన్ కళ్యాణ్ రిప్లై ఇవ్వలేదు అందుకే ఇలా మాట్లాడుతోందని కామెంట్ చేసేవారికి కూడా సెటైర్ వేసింది.
‘జనాలకి చెప్తున్నా నాకుsocial media మీడియా వేదికగా సమాధానం రాలేదు అనే కడుపు మంటతో పెట్టాను అనుకునేవాళ్ళకి అసలు నేనెపుడు ఆశ పడలేదు కల కనలేదు నేను ఎపుడు ఒక మంచి కారణం కోసం కలవాలి అని వేచి చూస్తున్న అది అమ్మాయిల జీవితంలో కొంత పోరాటాన్ని ఉత్త్సహాన్ని నింపేదిగా ఉండాలి’ అంటూ కౌంటర్ వేసింది.
ఇక మాధవీలత చేసిన ఈ పోస్ట్‌ను నిశితంగా గమనిస్తే ఇందులో పవన్ కళ్యాణ్ గురించి మంచే చెప్పింది. కానీ అది వేరే శైలిలో చెప్పింది. ఇక దీన్ని ఆసారాగా తీసుకుని ఓ మీడియా సంస్థ పవన్ కళ్యాణ్ వర్సెస్ మాధవీలత అని ఓ ప్రోగ్రాంను కూడా ఏసేసుకుంది. దీనిపై జనసేన భగ్గుమంది. ఇలాంటి జర్నలిజం, విద్వేషాలను రెచ్చగొట్టడం మానండి అని చురకలు అంటించింది.