మరో స్టార్ తో లోకేష్ మూవీ ఫిక్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ తో వయస్సు పైబడిన కూడా కుర్రాళ్ళతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో చేస్తోన్న జైలర్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. పాన్ ఇండియా లెవల్ లోనే ఈ చిత్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తో లాల్ సలామ్ అనే సినిమాలో రజినీకాంత్ నటించారు.

ఈ మూవీలో రజిని లీడ్ రోల్ చేయడం లేదు. అయితే అతని పాత్ర మూవీలో చాలా ప్రాముఖ్యంగా ఉంటుందంట. గత కొంత కాలం నుంచి టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ఉంటుందనే ప్రచారం కోలీవుడ్ సర్కిల్ లో నడుస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించనున్నారంట.

ప్రస్తుతం లోకేష్ ఇళయదళపతి విజయ్ తో లియో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీని దసరా సీజన్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే లియో మూవీ బిజినెస్ అన్ని భాషలలో జరిగిపోతోంది.

ఈ చిత్రం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తోనే లోకేష్ సినిమా ఉంటుందని తాజాగా అతనే క్లారిటీ ఇచ్చారు. రజినీకాంత్ తో చేయబోయే సినిమా కచ్చితంగా అందరి అంచనాలు అందుకునే విధంగా ఉంటుందని చెప్పారు. ఇక ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మించనుంది. అలాగే తనకి భాగా ఇష్టమైన పాత సినిమాలలో ఒకదానిని సీక్వెల్ చేస్తానని కూడా చెప్పారు.

ఇక రజినీకాంత్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత కార్తి ఖైది 2 మూవీ సెట్స్ పైకి వెళ్తుందని చెప్పారు. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ తో లోకేష్ కనగరాజ్ ఒక మూవీ చేయనున్నట్లు చెప్పారు. మరి ఈ సినిమాని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకొని వెళ్తారు అనేది ఇప్పుడు ప్రశ్నగా ఉంది.