ఇప్పుడు తమిళ సినిమా నాట వసూళ్ల మోత మోగిస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా దళపతి విజయ్ నటించిన సినిమా “లియో” అనే చెప్పాలి. కాగా ఈ సినిమాని టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించగా ఈ సినిమాపై అయితే విజయ్ కెరీర్ లో మునుపెన్నడూ చూడని భారీ హైప్ ని అయ్యితే చూసారు.
కాగా ఈ చిత్రం రిలీజ్ అయ్యి మరీ అంత హిట్ టాక్ తెచ్చుకోలేదు కానీ లోకేష్ కానగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కావడంతో దీనికి మాములు రెస్పాన్స్ మాత్రం రాలేదు అందుకే లియో తో ఒక రికార్డు బ్రేకింగ్ డే 1 వసూళ్లు ఓపెన్ అయ్యాయి. కాగా ఈ ఏడాదికి ఏ సినిమా కూడా ఈ రేంజ్ వసూళ్లు ఓపెన్ చేయలేదు.
అంతే కాకుండా జస్ట్ నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 400 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టగా ఇప్పుడు అయితే 6 రోజుల్లో సెన్సేషనల్ మార్క్ 500 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. 6వ రోజుతో అయితే లియో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 506.4 కోట్ల గ్రాస్ ని అందుకుంది అని అంటున్నారు.
దీనితో ఈ చిత్రం తమిళ్ సినిమా నుంచి మొట్ట మొదటి ఫాస్టెస్ట్ 500 కోట్ల గ్రాసింగ్ సినిమాగా నిలిచింది అని ట్రాకర్స్ చెప్తున్నారు. మొత్తానికి అయ్యితే దళపతి బాక్సాఫీస్ బ్లాస్ట్ మాములుగా లేదని చెప్పాలి. అయితే ఈ రేంజ్ వసూళ్లు అందుకున్న ఈ సినిమా తమిళనాడులో మాత్రం గొప్ప రికార్డ్స్ ఏవి బ్రేక్ చేయకపోవడం అనేది మాత్రం ఆశ్చర్యంగా మారింది.
One of the Fastest #Tamil Film to breach pass the ₹500crs mark Globally 💥❣️ #LeoFilm #Leo#ThalapathyVijay @actorvijay 👑❤️🔥#LeoHits500crores #BlockbusterLEO#LeoIndustryHit#BOEstimates #BOTracking @7screenstudio pic.twitter.com/xK0ezfMIuN
— Girish Johar (@girishjohar) October 25, 2023