ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా కూడా సౌత్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ హైప్ ఉన్న సినిమాగా వస్తున్నా చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరియు దర్శకుడు లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో తెరకెక్కించిన మెన్స్ ఏక్షన్ డ్రామా “లియో” అని చెప్పాలి.
అయితే తమిళ నాట అనుకుంటే ఏమో కానీ తెలుగు రాష్ట్రాల్లో లియో ఇప్పుడు అందరికీ షాకిస్తుంది. దీనితో పాటుగా తెలుగులో రెండు భారీ చిత్రాలు రిలీజ్ కి ఉన్నప్పటికీ తమిళ్ డబ్బింగ్ అయ్యిన ఈ చిత్రం ఊహించని విధంగా లీడింగ్ లో ఉంది. భారీ డామినేషన్ లో బాలయ్య “భగవంత్ కేసరి” అలాగే రవితేజ “టైగర్ నాగేశ్వరరావు” లని దాటి అడ్వాన్స్ బుకింగ్స్ లో వసూళ్లు నమోదు చేస్తుంది లియో.
కాగా లియో కి బుకింగ్స్ వసూళ్లే 7 కోట్లకి పైగా గ్రాస్ నమోదు కాగా భగవంత్ కేసరికి ఐదున్నర కోట్లుకి పైగా వసూలు చేసింది. కాగా టైగర్ నాగేశ్వరరావు మాత్రం కేవలం 1.65 కోట్లు మాత్రమే అందుకుంది. అయితే టైగర్ నాగేశ్వరరావు కి ఇంకో బ్యాలన్స్ ఉంది.
అయినా కూడా అసలు లియో సినిమా పట్ల తెలుగు ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఆసక్తిగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇది ఒకరకంగా తెలుగు సినిమాలకి మాత్రం అవమానమే అని చెప్పాలి. తెలుగు ఆడియెన్స్ మూవీ లవర్స్ అని అంతా అంటూ ఉంటారు కానీ తమ సినిమాలే పక్కన పెట్టేసే అంత అని ఇపుడు అందరికీ అర్ధం అయ్యి ఉంటుంది. మరి మిగతా వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.