సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ నుంచి ఎన్నో నేర్చుకున్నా: వరుణ్ తేజ్

Varun Tej's Ganu facing several problems

మెగా వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వరుణ్ తేజ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ముకుంద సినిమా ద్వారా పెట్టడం వరుణ్ తేజ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇటీవల గని సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన వరుణ్ తేజ్ విజయాన్ని అందుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.

శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తేజ్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగుపెడుతున్నానని.. ఈ సినిమా విషయంలో ఎంత ఆనందంగా ఉన్నానో అంతే భయపడుతున్నా అంటూ చెప్పుకొచ్చాడు .

ఇక ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నానని, పైలట్ ల జీవితాలను దగ్గరుండి చూసి చాలా నేర్చుకున్నానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగేలా కష్టపడుతున్నట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో గని సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని కాకపోతే ఆ సినిమా నిరాశపరిచిన కూడా ఆ సినిమా కోసం తీసుకున్న శిక్షణ నాకు ఎప్పటికైనా ఉపయోగపడుతుందని వరుణ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇలా వైఫల్యాల నుండి జీవితంలో చాలా పాఠాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు.