Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుందో మనకు తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1600 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమాకు కంటిన్యూగా పార్ట్ త్రీ కూడా రాబోతున్న విషయం మనకు తెలిసిందే ఈ విషయాన్ని క్లైమాక్స్ లో స్పష్టంగా వెల్లడించారు.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొంత భాగం షూటింగ్ జరిగినట్టు తెలుస్తుంది . ఇక రెండు సంవత్సరాల తర్వాత తిరిగి ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమవుతాయని సమాచారం ప్రస్తుతం అల్లు అర్జున్ తో పాటు సుకుమార్ కూడా ఇతర హీరోలతోనూ అలాగే దర్శకులతో సినిమాలకు కమిట్ అయ్యారు ఈ నేపథ్యంలోని ఆ సినిమాలన్నింటిని పూర్తి చేసిన తర్వాత పుష్ప3 ఉండబోతుందని తెలుస్తోంది.
ఇక తాజాగా జరిగిన ఈ షూటింగ్లో భాగంగా ఓ డైలాగ్ ఎంతో అద్భుతంగా ఉందని కొంతమంది టెక్నీషియన్ల ద్వారా ఈ డైలాగ్ లీక్ అయిందని తెలుస్తోంది. ఇక ఈ డైలాగ్ వింటే కనుక థియేటర్లో దగ్గర్లో పోవాల్సిందే అంత అద్భుతంగా ఈ డైలాగ్ ఉందని చెప్పాలి. మొదటి భాగంలో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా అనే డైలాగ్ భారీగా ఫేమస్ అయింది ఇక రెండో భాగంలో పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ మరో అద్భుతమైన డైలాగును సుకుమార్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఇక పార్ట్ 3 లో కూడా ఇంతకు మించిన అద్భుతమైన డైలాగు ఉందని తెలుస్తుంది కొంతమంది బిహారి గుండాలు అల్లు అర్జున్ ని చంపడం కోసం తన ఇంటికి వస్తారు. అయితే తనని చంపుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ అల్లు అర్జున్ వాళ్లను కొడుతూ పుష్పనీ వేసేయాలంటే ప్లానొక్కటే ఉంటే సరిపోదబ్బా.. గుండె ధైర్యం కూడా ఉండాలి.ఎవడు పడితే వాడు వచ్చి పొడిస్తే పోవడానికి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా కాదు ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్’ అంటూ పుష్ప డైలాగ్ చెప్తాడట… ఈ డైలాగు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ డైలాగ్ థియేటర్లో వినపడితే థియేటర్ మొత్తం దద్దరిల్లి పోవాల్సిందే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.