లీక్ షాక్ : “కల్కి” నుంచి ప్రభాస్ మరో షాకింగ్ లుక్ వైరల్ 

ఇపుడు పాన్ ఇండియా లోనే కాకుండ పాన్ వరల్డ్ సినిమా దగ్గర కూడా తనదైన ముద్ర వేసేందుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సిద్ధం అవుతున్నాడు. కాగా ఇప్పుడు పాన్ ఇండియా చిత్రం సలార్ వాయిదా పడిపోగా ఇక నెక్స్ట్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఇపుడు అందరికీ షాకిచ్చింది.

గత కొన్నాళ్ల కితమే ఈ సినిమా హాలీవుడ్ ఈవెంట్ లో ఫస్ట్ టీజర్ తో ఇండియన్ సినిమాని ఇంకో స్థాయికి తీసుకెళుతున్నట్టుగా క్లియర్ గా చూపించేసింది. పైగా నాగ్ అశ్విన్ ని ప్రభాస్ ని చూపించిన విధానం గాని కొత్త లుక్ గాని నెక్స్ట్ లెవెల్ లో వైరల్ అయ్యాయి.

కాగా ఈ చిత్రం షూటింగ్ ఇపుడు శరవేగంగా జరుగుతుండగా ఇప్పుడు ఈ సినిమా నుంచి ఊహించని విధంగా మొట్ట మొదటిసారి అయితే ఫస్ట్ లీక్ సినిమా నుంచి అయ్యింది. మరి ఈ లీక్ అవ్వడమే ప్రభాస్ మీదనే సీన్ అయిపోవడం అందరికీ షాకిచ్చింది. సినిమా స్టార్ట్ చేసి రెండేళ్లు అయ్యిన కూడా ఇప్పటికీ ఒక్క లీక్ రానిది..

ఇపుడు మొదటి సారి రావడం ఆశ్చర్యంగా మారగా ఈ లీక్ లో మాత్రం ప్రభాస్ అదే సూపర్ హీరో లుక్ లో అదిరిపోయాడు అని చెప్పాలి. ఆ లాంగ్ హెయిర్ వెనకాల భారీ ఓ భారీ సెట్టింగ్ చూస్తుంటే ఓ గ్రాండ్ సీక్వెన్స్ లా ఇది కనిపిస్తుంది. దీనితో ఈ షాకింగ్ లీక్ అయితే ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో బ్లాస్ట్ లా వైరల్ అవుతుంది.