యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించనున్న లావణ్య త్రిపాఠి… ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా నిర్ణయం!

అందాల రాక్షసి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఈ సినిమాలో తన అమాయకమైన నటనతో అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న లావణ్య ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఎప్పుడు లవ్‌ స్టోరీస్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలలో నటిస్తూ మన ఇంట్లో అమ్మాయిల కలిసిపోయిన లావణ్య ఇప్పుడు తన రూటు మార్చినట్లు కనిపిస్తోంది.

ఇంతకాలం సాప్ట్ రోల్స్ లో మాత్రమే నటించిన లావణ్య ఇప్పుడు యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో కనిపించనుంది. ప్రస్తుతం లావణ్య ఓ పోలీస్‌ కథాంశంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాల కోసం లావణ్య ఇప్పటికే ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. మొత్తానికి చాలా కాలం తర్వాత లావణ్య కొత్త తరహా సినిమాలో నటించబోతోంది. అయితే ఇలా తన క్యారెక్టర్‌ సెలక్షన్‌లో మార్పులు చేయడానికి గల కారణాన్ని లావణ్య ఇటీవల చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ‘లవ్ స్టొరీ సినిమాలలో నన్ను రక్షించడానికి హీరోలు వచ్చేవారు. కానీ ఇప్పుడు యాక్షన్ సినిమాలలో నన్ను నేను రక్షించుకోవడం చాలా థ్రిల్‌గా ఫీలవుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది . ఇప్పటివరకూ నటించిన అన్ని సినిమాల్లోనూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో కనిపించేసరికి ప్రేక్షకులు కూడా బోర్‌గా ఫీల్ అవుతున్నారు. అందువల్ల కొత్తదనం కోసం ఇలా కథల ఎంపికలో ప్రయోగాలు చేస్తు యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలను మాత్రం లావణ్య బయటపెట్టలేదు. తమిళ్ భాషలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఇండస్ట్రీ వర్గాల సమాచారం.