అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తెలుగు ప్రేక్షలకు బాగా దగ్గరైంది. మొదటి చిత్రంతోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. హోమ్లీ పాత్రలకు పెట్టింది పేరు లావణ్య. అయితే అనుకున్నంత స్థాయిలో స్టార్డంను సంపాదించుకోలేకపోయింది. భలె భలె మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి సినిమాలతో లావణ్య త్రిపాఠికి మంచి బ్రేక్ వచ్చింది. అయితే మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ మాత్రం కొట్టలేకపోయింది.
చివరగా అర్జున్ సురవరం సినిమాతో మళ్లీ తన సత్తా చాటింది. చాలా కాలం నుంచి సరైన సక్సెస్ కోసం చూసిన లావణ్య మంచి హిట్ వచ్చింది. ఆపై వరుసగా సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన ఏ1 ఎక్స్ ప్రెస్, కార్తికేయ హీరోగా రాబోతోన్న చావు కబురు చల్లగా చిత్రంలో నటిస్తోంది. ఏ1 ఎక్స్ ప్రెస్ కోసం ప్రత్యేకంగా హాకీలో శిక్షణ తీసుకుంటోంది.
అంతే కాకుండా లావణ్య ప్రస్తుతం సినిమా కోసమే మరింత ఫిట్‌నెస్ పెంచుకునేందుకు కసర్తతులు ప్రారంభించింది. అయితే తాజాగా లావణ్య చేసిన పోస్ట్ చూస్తే ఏదో తేడా కొడుతోంది. మనం మనలాగే ఉండాలి లేదంటూ ప్రపంచం మనల్ని తీసి అవతల పారేస్తుందంటూ ఓ కొటేషన్ కూడా చెప్పింది. ఒక వేళ మనమంత సేమ్‌గా ఉంటే ఈ ప్రపంచం మనల్ని బతకనివ్వదు.. అందుకే మీలా మీరు ఉండటం ఎన్నడూ ఆపకండి అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇంత పెద్ద మాట చెప్పాల్సినంత కష్టం లావణ్యకు ఏం వచ్చి ఉంటుందో.