రజనీకాంత్ మొహం పై లిప్ స్టిక్ తో పెయింటింగ్ వేసిన లత!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న రజనీకాంత్ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.ఇలా ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు ఉన్న రజనీకాంత్ వ్యక్తిగత జీవితంలో కూడా గొప్ప భర్తగా ఉన్నారు. రజనీకాంత్ తో ఇంటర్వ్యూకి వచ్చిన లత అనే అమ్మాయి రజనీకాంత్ ను చూసినమొదటి చూపులోనే ప్రేమలో పడ్డారు. ఇలా వీరిద్దరూ ప్రేమలో పడటంతో కుటుంబ పెద్దలను ఒప్పించి రజనీకాంత్ లత మెడలో 1981 మే 26వ తేదీ మూడుముళ్లు వేశారు.

తిరుపతిలో వీరి వివాహం జరిగింది. వివాహం జరిగిన అప్పటినుంచి రజనీకాంత్ లత ఎంతో అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని గడిపారు. ఇక వీరి పెళ్లి జరిగి సుమారు నాలుగు దశాబ్దాలు పూర్తి అయ్యింది. ఇక రజనీకాంత్ లత దంపతులకు ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్ అనే ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. తన తల్లిదండ్రులు వివాహం జరిగి నాలుగు దశాబ్దాలు పూర్తి అయినప్పటికీ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తన తల్లిదండ్రులకు సంబంధించిన ఒక మెమొరబుల్ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ ఫోటోలో రజనీకాంత్ కి తన భార్య లత ఎంతో సరదాగా తన మొహం పై ఎర్రటి లిప్ స్టిక్ తో పెయింటింగ్ చేశారు.ఇలా ఐశ్వర్య షేర్ చేసిన ఈ ఫోటో చూసిన ఎంతో మంది సూపర్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా వీరిద్దరూ ఈ ఫోటోలో సంతోషంగా ఉండటం చూస్తుంటే వీరిద్దరి మధ్య ఎంతో మంచి అన్యోన్యత ఉందని తెలుస్తోంది.