మెగాస్టార్ “వాల్తేరు వీరయ్య” పై క్రేజీ అప్డేట్స్ ఇవే.!

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా రెండు సినిమాలు ఏకకాలంలో చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాల్లో దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మాస్ మహారాజ రవితేజ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

దీనితో ఈ చిత్రం ఓ సాలిడ్ మాస్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రం పై అయితే లేటెస్ట్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇప్పుడు తెలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ అయితే హైదరాబాద్ లో జరుగుతూ ఉండగా రీసెంట్ గా ఓ సాంగ్ ని కంప్లీట్ చేయగా ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ పై ఓ మాస్ ఏక్షన్ బ్లాక్ ని తెరకెక్కిస్తున్నారట.

మరి దీనిని రామ్ లక్ష్మణ్ మాస్టర్ ల సారథ్యంలో దీనిని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక దీనితో పాటుగా మరో అప్డేట్ ఏమిటంటే ఈ సినిమా కి తన పార్ట్ వరకు మెగాస్టార్ చిరు తన డబ్బింగ్ ని టీజర్ తో పాటుగా సినిమాకి కూడా తన డబ్బింగ్ కంప్లీట్ చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్. ఇంకా ఈ సినిమాకి అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.