సలార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ చేస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ సలార్ పై అంచనాల స్థాయి రోజు రోజుకు మరింతగా పెరిగిపోతొంది. ఈ ప్రాజెక్టు ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇంతవరకు చిత్ర యూనిట్ ఆ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు. కానీ లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం త్వరలోనే టీజర్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అది కూడా ఆదిపురుష్ సినిమా విడుదలైన తర్వాతనే టీజర్ వస్తుందట.

జూన్ లో ఆదిపురుష్ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికి కూడా అనుకున్నంత స్థాయిలో బజ్ అయితే లేదు. ఇక ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే సలార్ టీజర్ ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే టీజర్ ను దర్శకుడు పూర్తిస్థాయిలో రెడీ చేసినట్లు సమాచారం.

హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో అలాగే ఒక పవర్ఫుల్ డైలాగ్ తో టీజర్ రెడీ అయ్యిందట. ఇక జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో టీజర్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ టీజర్ సినిమాపై అంచనాల స్థాయిని ఇంకా ఏ రేంజ్ లో పెంచుతుందో చూడాలి. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.