RRR: ఈ సారి పక్కా!

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ కోలీవుడ్ అలాగే ఇండియన్ మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో RRR ఒకటి. బాహుబలి లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం దర్శకధీరుడు రాజమౌళి నుంచి వస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కావడంతో అన్ని భాషల మీడియా కెమెరాలు ఇటువైపె ఫోకస్ చేశాయి. సాధారణంగా ఏదో ఒక అప్డేట్ తో సినిమాకు హైప్ క్రియేట్ చేసే జక్కన్న బాహుబలి రేంజ్ లో అయితే చేయడం లేదనే టాక్ వస్తోంది.

చేయడం లేదు అనడం కన్నా కూడా జక్కన్నకి ఈ సారి పరిస్థితులు ఏ మాత్రం సహకరించలేదనే చెప్పాలి. హీరోలకు గాయాలు, కోవిడ్ ఎఫెక్ట్.. అలాగే షూటింగ్ కాల్షీట్స్ లో మార్పులు చేయడం వలన సినిమా వరుసగా వాయిదాల వార్తలతో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. అయితే ఇటీవల సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ అభిమానుల్లో ఆశలను చిగురించింది. ఎట్టకేలకు సినిమా రిలీజ్ పై జక్కన్న ప్లాన్ వేసినట్లు సమాచారం.

సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా వస్తుందట. అదే సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ అనే మరొక టాక్ కూడా వస్తోంది. సినిమాను ఈ ఏడాది దసరాకు తప్పకుండా రిలీజ్ చేయాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. మళ్ళీ 2022 సంక్రాంతి అనే డేట్ కూడా ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తున్నప్పటికీ రాజమౌళి మాత్రం పక్కాగా ఈ దసరా సీజన్ ను ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.